ఏపీలో కోవిడ్‌ వర్రీ : మోడీకి సీఎం జగన్ లేఖ

  • Published By: madhu ,Published On : April 14, 2020 / 02:17 AM IST
ఏపీలో కోవిడ్‌ వర్రీ : మోడీకి సీఎం జగన్ లేఖ

Updated On : April 14, 2020 / 2:17 AM IST

లాక్‌డౌన్‌ పరిస్థితులు నేపథ్యంలో దేశ ఆర్థిక రథ చక్రాన్ని కనీస వేగంతోనైనా నడపాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అభిప్రాయపడ్డారు. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో లాక్‌డౌన్‌ గడువు ముగుస్తున్నందున దేశాన్ని రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌, గ్రీన్‌జోన్లను గుర్తించి..నియంత్రణ చర్యలు చేపట్టాలని జగన్ కోరారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా సంపూర్ణ మద్దతు తెలుపుతామన్నారు. వివిధ రంగాలపై లాక్‌డౌన్‌ ప్రభావాన్ని ప్రధానికి జగన్‌ నివేదించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై విజ్ఞప్తి చేశారు.  

రాష్ట్ర జీఎస్‌డీపీలో 34 శాతం వ్యవసాయ రంగానిదేనని.. లాక్‌డౌన్‌ కారణంగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్‌, రవాణాకు తీవ్ర అవాంతరాలు ఏర్పడ్డాయని జగన్‌ లేఖలో తెలిపారు. ఆయా రంగాలపై ఆధారపడి ఉన్నవారి జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని వివరించాయి. ఆక్వా ఎగుమతులకు ఆయా దేశాల్ల్లో మార్కెట్లు తెరుచుకునేలా కేంద్ర వాణిజ్యశాఖ చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆర్థిక రథచక్రాన్ని వేగంగా పరుగెత్తించలేకపోయినా కనీస వేగంతోనైనా నడపాల్సిన అవసరముందని జగన్ అభిప్రాయపడ్డారు. జాతీయ రహదారులతో పాటు రైల్వేల ద్వారా తిరిగి రవాణాను తిరిగి ప్రారంభించాలని ప్రధానిని జగన్‌ కోరారు.  

Also Read | ఏపీని వణికిస్తున్న కరోనా : మొత్తం 439 కేసులు..గుంటూరులో 93

మరోవైపు… రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.. రోజురోజుకు జడలు విప్పుతోంది. 2020, ఏప్రిల్ 13వ తేదీ సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 439కి  చేరింది. నిన్న ఒక్కరోజు 19 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో అత్యధికంగా 93 కేసులు గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు. అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించగా.. కర్నూల్‌ జిల్లాలో ఒక కోవిడ్‌ మృతి నమోదైంది. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కారణంగా ఆసుపత్రుల్లో 401 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే ఇప్పటివరకు 12మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కారణంగా ఆసుపత్రుల్లో 420 మంది చికిత్స  పొందుతున్నారు. అలాగే ఇప్పటివరకు 12మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు అధికారులు తెలిపారు.