ఏపీలో 111కు పెరిగిన కరోనా కేసులు..ఒక్కరోజే 67 మందికి పాజిటివ్
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 111కు పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 67 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 111కు పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 67 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 111కు పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 67 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మర్కజ్ వెళ్లివచ్చిన వారి వల్ల కేసులు అమాంతం పెరిగాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో 15, కడప జిల్లాలో 15, ప్రకాశం జిల్లాలో 15, పశ్చిమగోదావరి జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూరు జిల్లాలో ఒక కేసు చొప్పున నమోదు అయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
దేశ వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలే కారణం అని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో సహా దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ మత ప్రార్ధనలతో సంబంధం ఉండటమే దీనికి నిదర్శనం. ఇప్పడు దేశంలో అందరి దృష్టి నిజాముద్దీన్ మర్కజ్ మసీదుపైనే ఉంది.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతలోని మర్కజ్ మసీదు..మార్చినెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మత ప్రార్థనలు జరిగాయి. ఆ ప్రార్థనలకు దేశ, విదేశాల నుంచి ప్రజలు హాజరయ్యారు. మలేసియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్‌తో పాటు పలు దేశాలకు చెందిన మత ప్రచారకులు వచ్చారు. అలా వచ్చిన వారు వైరస్ ని…. ప్రార్థనలకు హాజరైన వారికి అంటించారు. ప్రార్థనలు ముగిశాక ఎవరి స్వస్థలాలకు వాళ్లు వెళ్లిపోయారు. అలా ఒకరినుంచి మరోకరికి కరోనా వైరస్ సోకింది.
ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 711 మంది వెళ్ళారు. వీరిలో విజయనగరం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం రూరల్‌లో ఒక్కరు, విశాఖపట్నం సిటీలో 41 మంది, తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో 16 మంది, రాజమండ్రిలో 21 మంది, కృష్ణా జిల్లాలో 16 మంది, విజయవాడ సిటీలో 27 మంది, గుంటూరు అర్బన్‌లో 45 మంది, గుంటూరు రూరల్‌లో 43 మంది. ప్రకాశం జిల్లాలో 67 మంది, నెల్లూరు జిల్లాలో 68 మంది, కర్నూల్ జిల్లాలో 189 మంది, కడప జిల్లాలో 59 మంది, అనంతపూర్ జిల్లాలో 73 మంది, చిత్తూరు జిల్లాలో 20 మంది, తిరుపతికి చెందిన 16 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారు.
వీరిలో అధిక శాతం మంది ఐసో లేషన్ లో ఉండటానికి ఇష్టపడటం లేదు. కనీసం ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు కూడా చేయించుకోకుండా నిమ్మకు నీరెత్తి నట్లు కూర్చోవటంతో వీరిని గుర్తించి పరీక్షలు చేయించేందుకు ప్రభుత్వం యత్నాలు చేస్తోంది.
Also Read | గాంధీలో కరోనా బాధితుడు మృతి…వైద్యులపై మృతుడి సోదరుడు దాడి