Visakha Cyber Crime : విశాఖ యూనియన్ బ్యాంకులో షాకింగ్ ఘటన.. కస్టమర్ ఖాతా నుంచి రూ.29లక్షలు మాయం

విశాఖలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోయారు. బ్యాంకు ఖాతా యజమానికి తెలియకుండా సైబర్ క్రిమినల్స్ దబ్బు దోచేశారు. బ్యాంకు ఖాతా యజమానే చెప్పినట్టు సైబర్ క్రిమినల్స్ బ్యాంకు సిబ్బందిని నమ్మించారు.

Visakha Cyber Crime : విశాఖ యూనియన్ బ్యాంకులో షాకింగ్ ఘటన.. కస్టమర్ ఖాతా నుంచి రూ.29లక్షలు మాయం

Updated On : August 23, 2022 / 6:37 PM IST

Visakha Cyber Crime : ఫుల్ క్యాష్ ఉన్న అకౌంట్స్ ను టార్గెట్ చేశారు. వాట్సాప్ మేసేజ్ లతో మాయ చేశారు. ఏకంగా బ్యాంకు ఉద్యోగులనే ఏమార్చారు. ఫైనల్ గా వాళ్లు అనుకున్న విధంగా లక్షలు కొట్టేశారు. బాధితులకు అనుమానం వచ్చి అడిగితే కానీ, సైబర్ నేరగాళ్ల వ్యవహారం బయటపడలేదు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది.

Online Loan Apps Harassment : తీసుకుంది రూ.2వేలు, కట్టింది రూ.15వేలు, అయినా న్యూడ్ ఫొటోలతో వేధింపులు.. లోన్ యాప్స్ దారుణాలు

విశాఖలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోయారు. బ్యాంకు ఖాతా యజమానికి తెలియకుండా సైబర్ క్రిమినల్స్ దబ్బు దోచేశారు. బ్యాంకు ఖాతా యజమానే చెప్పినట్టు సైబర్ క్రిమినల్స్ బ్యాంకు సిబ్బందిని నమ్మించారు. మనీ ట్రాన్స్ ఫర్ చేయాలంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు వాట్సాప్ మేసేజ్ లు పెట్టారు కేటుగాళ్లు. అది నమ్మిన బ్యాంకు సిబ్బంది కనీసం చెక్ ఏది అని అడగనూ లేదు, ఖాతాదారుడిని సంప్రదించనూ లేదు. ఎవరో పంపిన మేసేజ్ ల ఆధారంగా దాదాపు 29లక్షల 18వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేసేశారు. అయితే ఖాతాదారుడికి చెందిన మొత్తం రెండు అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ అయ్యాయి.

Extra Marital Affair : ప్రియుడిపై మోజుతో భర్తపై ఆరుసార్లు హత్యాయత్నం.. చివరికి సక్సెస్

మొదట ఒక అకౌంట్ నుంచి 3లక్షలకు పైగా ట్రాన్స్ ఫర్ చేసిన బ్యాంకు సిబ్బంది మళ్లీ మేసేజ్ రావడంతో మిగిలిన అమౌంట్ మొత్తం ట్రాన్స్ ఫర్ చేసేశారు. పెద్ద మొత్తంలో తన బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయినట్లు మేసేజ్ రావడంతో ఖాతాదారుడు షాక్ తిన్నాడు. వెంటనే బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేశాడు. బ్యాంకు మేనేజర్ స్పందించకపోవడంతో బాధితులే బ్యాంకు దగ్గరికి వచ్చి వివరాలు అడిగాడు. అప్పుడు బ్యాంకు సిబ్బంది నిలువెత్తు నిర్లక్ష్యం బయటపడింది. దీంతో ఖాతాదారులు ఫైర్ అవుతున్నారు. ఇది పూర్తిగా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమే అని మండిపడుతున్నారు.