ఈ సైకిళ్లకు మొలకలొచ్చాయ్.. తీగలు పుట్టుకొచ్చాయ్..!

ఈ సైకిళ్లకు మొలకలొచ్చాయ్.. తీగలు పుట్టుకొచ్చాయ్..!

Updated On : December 19, 2020 / 12:04 PM IST

సైకిళ్లకు ఆ తీగలేంటి? చుట్టూ పొదలేంటి? కూరగాయల సాగు కోసం ఇలా సెట్ చేశారా? అనుకుంటున్నారా? అదేం కాదండోయ్.. సైకిళ్లు ఉన్నచోటే తీగలు పుట్టుకొచ్చాయి. మొత్తం అల్లుకుపోయి చెట్ల పొదలతో నిండిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ సైకిళ్లకు మొలకలొచ్చాయ్.. ఇదేంటీ సైకిళ్లకు మొలకలు రావడమేంటి? అనుకుంటున్నారా?

ఈ ఫొటో చూస్తే మీరు అదే అంటారు.. చెట్ల తీగలు ఏం చక్కా సైకిళ్లకు ఎలా అల్లుకుపోయాయో చూడండి..చెట్ల తీగల మధ్యలో సైకిళ్లకు పైనా బెల్స్ ఉంటే.. కిందిభాగంలో ఎర్ర లైట్లు, టైర్లు, చక్రాలు ఉన్నాయి. 200 కొత్త సైకిళ్లు తుప్పు పట్టి పోయాయి. అలా పడేసిన సైకిళ్లపై తీగలు, పొదలు మొలకెత్తాయి.

ఈ సంఘటన కర్నూలు జిల్లా డోన్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఇలా సైకిళ్లు కనిపించాయి. ఒక్కో సైకిల్ విలువ రూ.4వేలకు పైగా ఖరీదు ఉంటుంది. సంబంధిత అధికారిక శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల బాలికలకు వీటిని పంపిణీ చేయలేదు.

జిల్లాలో ఆదరణ పథకం కింద మంజూరైన సైకిళ్లు చాలా ఇలా నిరూపయోగంగా ఉండిపోయాయి. ఎక్కువ రోజులు అలానే ఉండటంతో ఆ చోట ఇలా చెట్ల తీగలు, పొదలతో నిండిపోయాయి.