AP Rains : తీరం దాటిన వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వాన.. 60కి.మీ వేగంతో గాలులు.. బయటకు రావొద్దు..
AP Rains : దక్షిణ ఒడిశా -గోపాల్‌పూర్ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఇది పశ్చమ దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది.

AP Rains
AP Rains : దక్షిణ ఒడిశా -గోపాల్‌పూర్ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఇది పశ్చమ దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. అయితే, ఏపీలోని పలు జిల్లాల్లో 24గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
గంటకు 12 కి.మీ వేగంతో కదిలిన వాయుగుండం.. గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణ ఒడిశా తీరం దాటింది. దీని ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అన్నారు. తీరం వెంబడి 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, వర్షాల సమయంలో ప్రజలు బయటకు రావొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: Chiranjeevi Fans: జాగ్రత్త.. మరోసారి నోరు జారితే.. బాలకృష్ణకు చిరంజీవి అభిమానుల వార్నింగ్
🔸 తీరం దాటిన వాయుగుండం
🔸 గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణ ఒడిశా తీరం దాటిన వాయుగుండం
🔸గడిచిన 6గంటల్లో గంటకు 12కిమీ వేగంతో కదిలిన వాయుగుండం
🔸ఇది దక్షిణ ఒడిశా,ఛత్తీస్‌గఢ్ మీదుగా క్రమంగా బలహీనపడనుంది
🔸దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కర్నూలు,నంద్యాల,అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు pic.twitter.com/fJDLiU0iSz— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 27, 2025