Daggubati Purandeswari : జనసేన-బీజేపీ పొత్తు, పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై పురంధేశ్వరి హాట్ కామెంట్స్

పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు, మా అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందని పురంధేశ్వరి కామెంట్ చేశారు. Daggubati Purandeswari

Daggubati Purandeswari : జనసేన-బీజేపీ పొత్తు, పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై పురంధేశ్వరి హాట్ కామెంట్స్

Daggubati Purandeswari On Pawan Kalyan Comments

Daggubati Purandeswari – Pawan Kalyan : జనసేన-బీజేపీ పొత్తు అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ చేసే ప్రతి కామెంట్ పై నేను స్పందించాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. పొత్తులపై పవన్ ప్రకటన, ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పొత్తులు, పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామని పురంధేశ్వరి తేల్చి చెప్పారు.

ప్రస్తుతం జనసేనతో పొత్తు కొనసాగుతుందా..? లేదా..? అనే అంశంపైనా జాతీయ నాయకత్వమే చెప్పాలన్నారు. పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు, మా అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందని పురంధేశ్వరి కామెంట్ చేశారు.

Also Read: ఎమ్మెల్యేలు, ఎంపీపీలపై మంత్రి బొత్సకు ఆగ్రహమెందుకు?

”మాది ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలు ఎలా జరిగాయనే అంశంపై విశ్లేషించుకున్నాం. ఆయుష్మాన్ భారత్ 10,596 కార్డులను పేదలకు పంపిణీ చేశాం. మండల ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేశాం. త్వరలో రాష్ట్ర కార్యవర్గం జరుగుతుంది. జేపీ నడ్డా హాజరు కానున్నారు.

మద్యం మీద, గ్రామ పంచాయతీ రాజ్ సంస్థల నిధుల మళ్లింపుపైనా ఆందోళనలు చేపట్టాం. కేంద్ర బృందం వచ్చి నిధుల మళ్లింపుపై విచారణ చేపట్టింది. ఏపీలో స్థానిక సంస్థల నిధుల మళ్లింపు జరిగిందని కేంద్ర బృందం నిర్దారణకు వచ్చింది. నాణ్యత లేని మద్యం వల్ల లివర్ సిరోసిస్ వ్యాధి పెరిగిందని.. కేజీహెచ్ వైద్యులు స్పష్టం చేశారు” అని పురంధేశ్వరి అన్నారు.

Also Read: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్‌ టార్గెట్?

కాగా, వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలుపే తమ ప్రధాన లక్ష్యం అని పవన్ తేల్చి చెప్పారు. జనసేన-టీడీపీ ఎదుగుతాయన్న పవన్ కల్యాణ్.. ఎవరైనా తమతో కలిసి వస్తాము అంటే కచ్చితంగా ఆహ్వానిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎవరైనా తమతో కలిసి వస్తాము అంటే ఆహ్వానిస్తాము అని పవన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి చేసినవే అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఇప్పటికైనా పొత్తులపై బీజేపీ క్లారిటీ ఇవ్వాల్సిందిగా పవన్ అలా అన్నారని విశ్లేషిస్తున్నారు.

”2024 ఎన్నికల్లో సహకరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకరికొకరు కచ్చితంగా ఎందుకు సహకరించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. భవిష్యత్తులో భాగంగా జనసేన ఎదుగుతుంది. టీడీపీ స్థిరపడుతుంది. ఎవరు కలిసి వస్తామన్నా కచ్చితంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం” అని పవన్ కల్యాణ్ అన్నారు.