Chandrababu Naidu : డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ

తన హత్యకు కుట్ర చేస్తున్నారని తాజాగా వంగవీటి రాధా ఓ సభలో మాట్లాడిన విషయం తెలిసిందే.. ఇదే అంశంపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. రాధా హత్యకు రెక్కీ చేసిన వారిని పట్టుకోవాలని కోరారు

Chandrababu Naidu : డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ

Chandrababu Naidu

Updated On : December 29, 2021 / 9:21 AM IST

Chandrababu Naidu : డిసెంబర్ 26న వంగవీటి మోహన రంగా వర్థంతి సభ విజయవాడలో జరిగిన విషయం తెలిసిందే.. ఈ సందర్బంగా రంగా కుమారుడు రాధా, తనకు ప్రాణహాని ఉందంటూ సభాముకంగా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రభుత్వం 2+2 భద్రత కల్పించింది. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాసారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరుపాలని బాబు కోరారు.

చదవండి : Chandrababu Wishes Jagan : సీఎం జగన్‌కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

సమగ్రవిచారణ చేసి దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని, ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని, వీటిపై చర్యలు లేకే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు.

చదవండి : Chandrababu Naidu : భావితరాల భవిష్యత్ కోసం ఒకే రాజధాని ఉండాలి