వైసీపీకి షాక్ ఇవ్వనున్న మాజీమంత్రి బాలినేని..? ఆ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం..!

ఎన్నికల్లో తాను సిఫార్సు చేసిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వకపోవడం, తనకు పదవి దక్కకపోవడంపై అలకబూనారు బాలినేని.

వైసీపీకి షాక్ ఇవ్వనున్న మాజీమంత్రి బాలినేని..? ఆ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం..!

Updated On : September 12, 2024 / 6:53 PM IST

Balineni Srinivasa Reddy : సీనియర్ నేత, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. వైసీపీకి షాక్ ఇవ్వనున్నారా? ఆయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? త్వరలో జనసేనలో చేరబోతున్నారా? ఇప్పుడీ వ్యవహారం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే.. మరికొందరు కీలక నాయకులు వైసీపీని వీడనున్నారనే వార్తలు ఆ పార్టీలో కలకలం రేపాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారం ఇప్పుడు జగన్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

వైసీపీలో బాలినేని శ్రీనివాస రెడ్డి పంచాయతీ మరోసారి రచ్చకెక్కింది. బాలినేని.. పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కొంత కాలంగా పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు బాలినేని. ఎన్నికల్లో తాను సిఫార్సు చేసిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వకపోవడం, తనకు పదవి దక్కకపోవడంపై అలకబూనారు బాలినేని. దీంతో ఆయన పార్టీ మారతారని జోరుగా ప్రచారం నడుస్తోంది.

పార్టీ మారే విషయంపై ఆయన ఇప్పటికే కుటుంబసభ్యులతో పాటు తన అనుచరులతో చర్చించారని ప్రచారం సాగుతోంది. కాగా, బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన పార్టీలో చేరడం ఖాయమని, కాకపోతే ఇప్పుడే కాదని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి టెన్ టీవీతో చెప్పారు.

 

Also Read : నడిపించే నాయకులు కావలెను..! వైసీపీకి ఎందుకీ దుస్థితి? జగన్ చేసిన ఆ మార్పులే ముంచాయా?