Arvind Kejriwal: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బుధవారం సాయంత్రమే కుటుంబ సమేతంగా అరవింద్ కేజ్రీవాల్ తిరుమలకు చేరుకున్నారు.

Arvind Kejriwal
Arvind Kejriwal In Tirumala: అమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన సతీమణి సునీత, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు కేజ్రీవాల్ కు స్వాగతం పలికారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బుధవారం సాయంత్రమే కుటుంబ సమేతంగా అరవింద్ కేజ్రీవాల్ తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం కుటుంబంతో కలిసి ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి తిరుమలలోనే బస చేసి.. గురువారం ఉదయం కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తిరుమలను దర్శించుకోవడం ఇదే తొలిసారి.
తిరుమలకు చేరుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్
కుటుంబ సమేతంగా రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న అరవింద్ కేజ్రివాల్.
అరవింద్ కేజ్రివాల్ తిరుమలను దర్శించుకోవడం ఇదే తొలిసారి. pic.twitter.com/tXVmapb38X
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2024