Nellore : తీవ్ర విషాదం.. గ్యాస్ పేలి ముగ్గురు మృతి
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు

Nellore (2)
Nellore : నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అబ్బాస్, అతడి భార్య సౌషద్ అక్కడిక్కడే మృతి చెందగా కుమార్తె అయేషా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
చదవండి : Nellore : జిల్లాలో దారుణం.. 13 ఏళ్ల బాలికను చెరువు గట్టువద్దకు లాక్కెళ్లి
కాగా ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అబ్బాస్ కుటుంబం స్థానికంగా టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున యధావిధిగా గ్యాస్ వెలిగించడంతో అప్పటికే లీక్ అవడంతో పేలుడు జరిగి మంటలు వ్యాపించాయి. తెల్లవారు జామున కేకలు వినిపించడంతో అందరు హడలిపోయారు.
చదవండి : Nellore: నెల్లూరు జిల్లాలో నేలకేసి కొట్టినా పగలని కోడి గుడ్లు
పరుగులు తీస్తూ అబ్బాస్ ఇంటివైపు వచ్చారు. అయితే అప్పటికే అబ్బాస్, సౌషాద్ మంటల్లో కాలి మృతి చెందారు. వారి కుమార్తె అయేషాకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇక ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.