AP Farmers: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. వర్షాలకు పంట నష్టపోయిన వారికి పరిహారం వచ్చేసింది..
పంట నష్టపోయిన 2వేల 856 రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు చెల్లింపులు చేయాలని ఆదేశించింది.
AP Farmers: ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్. వర్షాలకు పంట నష్టపోయిన వారికి పరిహారం వచ్చేసింది. గతేడాది మే, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన వన పంటలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఉద్యాన వన పంటలు సాగు చేసిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ. 4.82 కోట్ల నిధుల విడుదలకు పరిపాలన పరమైన ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మే 2024లో ఉద్యాన వన పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కోసం రూ 4.31 కోట్లు మంజూరు చేసింది.
పంట నష్టపోయిన 2వేల 856 రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు చెల్లింపులు చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 2024 లో ఉద్యాన వన పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద 50 లక్షల 16 వేలు మంజూరు చేసింది ప్రభుత్వం. పంట నష్టపోయిన 501 మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఉద్యాన వన శాఖ డైరెక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: ఏపీ ప్రభుత్వం సంచలనం.. చెవిరెడ్డి, ఫ్యామిలీ ఆస్తులు అటాచ్..
