Gossip Garage: టీడీపీ చరిత్రనే తిరగరాసేలా.. పెద్ద పెద్ద స్కీమ్స్ ఇంప్లిమెంట్.. సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం వెనుక ప్లానేంటి?

ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి హవాకు ఢోకా ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ మాత్రం స్కీమ్‌ల ఇంప్లిమెంట్‌లో లూప్‌హోల్స్ వెతికే పనిలో పడింది.

Gossip Garage: టీడీపీ చరిత్రనే తిరగరాసేలా.. పెద్ద పెద్ద స్కీమ్స్ ఇంప్లిమెంట్.. సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం వెనుక ప్లానేంటి?

Updated On : August 2, 2025 / 9:40 PM IST

Gossip Garage: ఆయన అభివృద్ధి జపమే చేస్తారు. సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయలేరు. సాధ్యం కాని హామీలిచ్చారు. బాబు షూరిటీ..మోసం గ్యారెంటీ అంటూ గగ్గోలు పెట్టింది అపోజిషన్. కానీ ఫస్ట్ టైమ్‌ టీడీపీ హిస్టరీలోనే కాదు..సీఎంగా చంద్రబాబు ట్రాక్‌ రికార్డులోనూ..ఈసారి సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. పలానా స్కీమ్‌ అమలు అంత ఈజీ కాదు. ఏం చేసినా ఇంప్లిమెంట్‌ చేయలేరన్న భావించిన పథకాలను కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతున్నారు చంద్రబాబు. వైసీపీ అస్త్రాలన్నింటినీ వరుస పెట్టి లాగేసుకుంటున్నారా.? సంక్షేమం విషయంలో అపోజిషన్‌కు వాయిస్‌ లేకుండా చేస్తున్నారా.?

అందరి అంచనాలను తలకిందులు చేస్తున్నారు. చంద్రబాబు అంటే ఓన్లీ డెవలప్‌మెంట్‌ మాత్రమేనని ఉండే ట్యాగ్‌లైన్‌ను మార్చేస్తున్నారు. ఆడా ఉంటా..ఈడా ఉంటా అన్నట్లుగా ఇటు అభివృద్ధి..అటు సంక్షేమం రెండూ చేస్తా అంటున్నారు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తానని చేతలతో ప్రూవ్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అపోజిషన్‌ విమర్శలకు అమలుతోనే సమాధానం చెబుతూ వస్తున్నారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే స్పెషాలిటీ..
అస్సలు అమలు చేయలేరు. సాధ్యం కాదు. ఖజానా ఖాళీగా ఉంది. ఈ స్కీమ్‌ అమలు చేయాలంటే అన్ని కోట్లు కావాలి. ఆ స్కీమ్‌ ఇంప్లిమెంట్‌ చేయాలంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మినా సరిపోవు అంటూ..ఎక్కడా లేని లెక్కలన్నీ వేసింది అపోజిషన్. పైగా బాబు అంటే అభివృద్ధి పేరుతో కాలం వెళ్లదీస్తారు తప్ప..సంక్షేమం జోలికి వెళ్లరని..పేదోడికి సాయం చేయడం ఆయన డిక్షనరీలోనే లేదని గాయిగత్తర లేపింది వైసీపీ. కానీ తనకంటూ ఓ స్టైల్ ఉందని.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తన స్పెషాలిటీ అంటూ సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు సీఎం చంద్రబాబు.

టీడీపీ హిస్టరీలోనే అతి పెద్ద సంక్షేమ పథకం..
టీడీపీ హిస్టరీలోనే అతి పెద్ద సంక్షేమ పథకం తల్లికి వందనం స్కీమ్‌తో ప్రతి ఇంటికి చేరువైంది కూటమి సర్కార్. ఆ తర్వాత అమలు సాధ్యం కాదని..రైతులకు సాయం చేయలేరని నమ్ముకున్న వైసీపీకి మరోసారి షాక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఏకంగా అన్నదాత సుఖీభవ స్కీమ్‌ను ఇంప్లిమెంట్ చేసి రైతు రాజ్యంగా చెప్పుకుంటున్నారు. అధికారంలో వచ్చిన తొలినాళ్లలోనే పెన్షన్‌ను 4వేలకు పెంచి ప్రతీ నెల ఫస్ట్‌నే ఇస్తున్నారు.

ఈ మూడు స్కీమ్స్ విషయంలో అపోజిషన్‌తో పాటు అందరి అంచనాలను చంద్రబాబు తలకిందుకులు చేశారనే చెప్పాలి. వృద్దులు, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చి పేదలకు దగ్గరైంది కూటమి సర్కార్. ఇక తల్లికి వందనమే తమ ఆయుధమకున్న వైసీపీకి..ఆ స్కీమ్‌ ఇంప్లిమెంట్‌తో తన థర్టీ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఏంటో చూపించారు చంద్రబాబు. నీకు పదిహేను..నీకు పదిహేను..నీకు పదిహేను..అంటూ వైసీపీ అధినేతతో సహా ఆ పార్టీ నేతలు చేసిన విమర్శలకు ఆన్సర్ ఇచ్చేసింది కూటమి సర్కార్. ట్రోలింగ్స్‌కు, అపోజిషన్‌ అటాక్‌కు అసలు సిసలు సమాధానం స్కీమ్‌ అమలుతోనే ఇచ్చినట్లు అయింది.

Also Read: పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ లోకేశ్‌ కీరోల్.. ఏం జరుగుతోంది?

టీడీపీ చరిత్రనే తిరగరాసేలా పెద్ద పెద్ద స్కీమ్స్ ఇంప్లిమెంట్..
అయితే సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేయరు, ఆయనకు ఆ ట్రాక్ రికార్డు అన్నది లేదంటూ విపక్ష వైసీపీ పదే పదే చేసిన విమర్శలకు సరైన బదులునే చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు. దేశంలోనే ఎక్కడా ఎవరూ చేయని విధంగా ఆ మాటకు వస్తే టీడీపీ చరిత్రనే తిరగరాసేలా పెద్ద పెద్ద స్కీమ్‌లను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారని అంటున్నారు.

మామూలుగా అయితే అధికార పక్షం హామీలు అమలు చేయకపోతేనే అపోజిషన్‌కు అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. అలా చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమకు ఈజీగా దొరికిపోతారనుకున్న వైసీపీకి ఒక్కో స్కీమ్‌ ఇంప్లిమెంట్‌తో ఝలక్ ఇస్తున్నారు చంద్రబాబు. అభివృద్ధికే బాబు అంబాసిడర్ అని అనుకునే వారికి సంక్షేమానికి కూడా తాను అసలైన చిరునామా అని అనిపించుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.

ప్రతిపక్షానికి ఎజెండా లేకుండా.. అస్త్రాలన్నింటినీ లాగేసుకుంటున్నారు చంద్రబాబు. దీంతో వైసీపీ కూడా రూట్‌ మార్చిందంటున్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం పథకాలు ఇవ్వడం లేదన్న విమర్శల కంటే..తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని..రాజకీయంగా వేధిస్తున్నారని..రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని వైసీపీ కొత్త రాగం అందుకుందన్న టాక్ వినిపిస్తోంది.

ఈ పథకాల అమలుతో సర్కార్ పై పాజిటివ్ టాక్..
త‌ల్లికి వంద‌నం, అన్నదాత సుఖీభవ స్కీమ్‌ల అమలుతో కూటమి స‌ర్కార్‌పై పాజిటివ్‌ టాక్ పెరుగుతుందనే చెప్పొచ్చు. అస‌లు ఇవ్వర‌న్న ప్రచారం నుంచి ఇస్తార‌న్న ప్రచారం దాకా..ఇచ్చేవ‌ర‌కు తీసుకొచ్చిన ప‌థ‌కాలు..ప్రతీ ఇంటికి చేరుతున్నాయంటున్నారు. దీంతో వైసీపీ మరో దారిలో కూటమిని పబ్లిక్‌లో నెగెటివ్‌ చేసే స్కెచ్ వేసిందన్న టాక్ నడుస్తోంది.

కూటమి హవాకు నో ఢోకా..!
అయితే చంద్రబాబు మాత్రం సంక్షేమానికి ఇస్తున్న ప్రయారిటీ చూస్తుంటే..ఇదో పెద్ద ప్లానే వేశారన్న చర్చ అయితే నడుస్తోంది. స్కీమ్‌ల విషయంలో జనం నుంచి వ్యతిరేకత రాకముందే ఓ పథకాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు. ఇక చంద్రబాబుకు ఆల్రెడీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అన్న పేరు ఉండే ఉంది. అటు అభివృద్ధి, అటు సంక్షేమం రెండూ బ్యాలెన్స్ చేస్తుండటంతో..ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి హవాకు ఢోకా ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ మాత్రం స్కీమ్‌ల ఇంప్లిమెంట్‌లో లూప్‌హోల్స్ వెతికే పనిలో పడింది.