Gossip Garage : జగన్ ఇంటి దగ్గర వ్యాపించిన మంటల్లో కాగితాలు, డైరీలు తగలబెట్టారా?
మద్యపాన నిషేధం పేరుతో..భారీగా లిక్కర్ రేట్లు పెంచేసి..కమీషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు ఇచ్చారని అంటున్నారు. ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా గతేడాది సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసిన సీఐడీ మరింత ఇన్ఫర్మేషన్ సేకరించిందట.

Gossip Garage : జగన్ 2.O కామెంట్స్..లిక్కర్ పాలసీపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు..తాడేపల్లిలో మంటలు..కట్ చేస్తే లిక్కర్‌కు లింకు పెడుతూ టీడీపీ చేసిన ట్వీట్‌తో..నవ్యాంధ్ర పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌కు భద్రతా లోపమే కారణమని ఫ్యాన్ పార్టీ అంటుంటే..టీడీపీ సంచలన ఆరోపణలు చేస్తుంది. లిక్కర్ ఫైల్స్ తగలబడ్డాయని ట్వీట్ చేసి దుమారం లేపుతోంది టీడీపీ. అసలు జగన్ 2.O కామెంట్స్‌కు లిక్కర్ ఫైల్స్‌కు లింకేంటి? జగన్ ఇంటి దగ్గర వ్యాపించిన మంటల్లో కాగితాలు, డైరీలు తగలబెట్టారా.?
ఏపీలో ఎత్తుకు పైఎత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికలు అయిపోయి ఏడెనిమిది నెలలు అయిందో లేదో..సోషల్ మీడియాలో ఒకరి మీద మరొకరు పోస్టులతో పీక్ లెవల్ హీట్‌ను క్రియేట్ చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ 2.O కథ వేరే ఉంటుందని చేసిన కామెంట్స్‌పై ఓవైపు సెటైర్లు పేలుతున్నాయి.
జగన్ 2.O అంటే ఆధారాలు ధ్వంసం చేయడమేనా?
ఇంకోవైపు గత సర్కార్ హయాంలో అమలైన మద్యం విధానంపై దర్యాప్తుకు ఆదేశిస్తూ సిట్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సరిగ్గా అదే రోజు రాత్రి వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర అగ్నిప్రమాదం జరిగింది. రెండుసార్లు మంటలు వ్యాపించినట్లు చెబుతున్నారు. ఈ డెవలప్‌మెంట్స్ అన్నింటికీ లింకులు పెడుతోంది టీడీపీ. జగన్ 2.O అంటే ఆధారాలు ధ్వంసం చేయడమేనా అని సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిస్తున్నారు టీడీపీ అభిమానులు.
Also Read : మాజీమంత్రి విడదల రజిని మెడకు మరో ఉచ్చు..! ఇలాంటి కేసు వస్తుందని అస్సలు ఊహించలేదట..!
జగన్ నివాసం దగ్గర రోడ్డు పక్కన ఉన్న గార్డెన్‌లో మంటలు..
తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర రోడ్డు పక్కన ఉన్న గార్డెన్‌లో మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం ఒకసారి, రాత్రి తొమ్మిది గంటల సమయంలో మరోసారి మంటలు వ్యాపించినట్లు వైసీపీ చెబుతోంది. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. భద్రతా లోపం వల్లే జగన్ ఇంటి దగ్గర ప్రమాదం జరిగినట్లు ఆరోపించింది. జగన్ భద్రతపై ప్రజలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
వైసీపీ ఆరోపణలపై టీడీపీ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. సిట్టు పడింది-తగలబడింది.. అంటూ ట్వీట్ చేసింది. లిక్కర్ స్కాంలో సిట్ ఏర్పాటుకాగానే..తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి? సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగలబెట్టారా అని ప్రశ్నిస్తోంది టీడీపీ.
ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది..!
జగన్ ఇంటి ముందున్న సీసీ టీవీ ఫుటేజ్‌ను ఎందుకు బయట పెట్టట్లేదో చెప్పాలంటోంది. తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే జగన్ 2.Oనా అటాక్ స్టార్ట్ చేస్తోంది టీడీపీ. ఎన్ని కుట్రలు చేసి తప్పించుకోవాలనుకున్నా..సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, మీ అవినీతిని బయటకు తీస్తుంది అంటున్నారు టీడీపీ నేతలు. గెట్ రెడీ..స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్ అంటూ టీడీపీ చేసిన ట్వీట్ దుమారం లేపుతోంది.
వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని కూటమి పార్టీలు ఎప్పటి నుంచో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత ఐదేళ్లలో అమలైన మద్యం విధానంపై దర్యాప్తునకు ఆదేశిస్తూ సిట్‌ను ఏర్పాటు చేసింది కూటమి సర్కార్. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న ఏ బ్రాండ్‌ను మార్కెట్‌లో కనిపించకుండా చేశారని..ప్లాన్ ప్రకారం కొత్త బ్రాండ్లను తెచ్చారని అలిగేషన్స్ ఉన్నాయి.
ప్రతి బాక్స్‌పై కనీసం రూ.150 నుంచి రూ.450 వరకు వసూలు?
మద్యపాన నిషేధం పేరుతో..భారీగా లిక్కర్ రేట్లు పెంచేసి..కమీషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు ఇచ్చారని అంటున్నారు. ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా గతేడాది సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసిన సీఐడీ మరింత ఇన్ఫర్మేషన్ సేకరించిందట. పాపులర్ మద్యం బ్రాండ్లను తీసేసి..నాసిరకం బ్రాండ్లు తెచ్చి షాపులకు సప్లై చేసినట్లు గుర్తించారట.
Also Read : ఈసారైనా క్యాబినెట్ విస్తరణ జరిగేనా? మంత్రి పదవి దక్కే ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు?
ప్రతి బాక్స్‌పై కనీసం రూ.150 నుంచి రూ.450 వరకు..గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి ఈ కలెక్షన్స్‌లో కీలక పాత్ర పోషించారని అలిగేషన్ చేస్తున్నారు టీడీపీ నేతలు.
జగన్ అండ్ కో ఏకంగా మద్యం డిస్టిలరీస్‌ను బలవంతంగా లాక్కుందట. ఏపీలోనే పెద్దదైన నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌తో పాటు దాదాపు అన్నింటినీ గుప్పిట్లోకి తెచ్చుకున్నారట. డిస్టిలరీల్లో నాసిరకమైన బ్రాండ్లు ఉత్పత్తి చేయించిందంటున్నారు. కమీషన్లు ఇచ్చిన వారికి మాత్రమే రూ.వేల కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారట. ఒక ఆర్గనైజర్డ్ మాఫియాగా ఏర్పడి వేల కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారట. ఈ నేపథ్యంలోనే సిట్‌ను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం.
ఆ తర్వాత గంటల వ్యవధిలోనే జగన్ ఇంటి దగ్గర అగ్నిప్రమాదం జరగడంతో లిక్కర్ ఫైల్స్‌కు లింకు పెడుతోంది టీడీపీ. జగన్ 2.O కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ తప్పు చేసి పక్కోడి మీద నెట్టేయడమే 2.Oనా అని రివర్స్ అటాక్ చేస్తోంది. ఇలా జగన్ 2.O కామెంట్స్..లిక్కర్ పాలసీపై సిట్..తాడేపల్లిలో మంటలు..అన్నింటిని సింకు చేసి..ఫ్యాన్ పార్టీని కార్నర్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. జగన్ ఇంటి దగ్గర మంటలకు కారణమేంటో? లిక్కర్ పాలసీపై సిట్ దర్యాప్తు ఏం తేల్చబోతోంది? వేచి చూడాలి.