GVL Narasimha Rao: రాష్ట్రంలో రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు కనిపించవా..?

రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరిపేర్లేనా..? మిగిలినవారి పేర్లు కనిపించవా.. ? అని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు ప్రశ్నించారు. ఎదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు.

GVL Narasimha Rao: రాష్ట్రంలో రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు కనిపించవా..?

GVL Narasimha Rao

Updated On : February 16, 2023 / 11:47 AM IST

GVL Narasimha Rao: ఏపీలో ప్రతీ పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలిన వారిపేర్లు పెట్టరా? అంటూ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు అన్నారు. బందర్ రోడ్డులో వంగవీటి మోహనరంగా విగ్రహానికి జీవీఎల్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగా వ్యక్తిత్వం గురించి, బడుగుబలహీనవర్గాల సేవల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించానని అన్నారు. భారతదేశ చరిత్రలో రంగా చరిత్ర అరుదైన సంఘటన అని, మూడేళ్లలోనే 35ఏళ్ల ఖ్యాతిని వంగవీటి రంగా సంపాదించుకున్నాడని జీవీఎల్ అన్నారు.

GVL fires On CM KCR : కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఏపీ వెళతారు? : బీజేపీ ఎంపీ

రాజకీయాలు అనేవి పార్టీలకు, కులాలకు సంబంధించినవి కాదని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరిపేర్లనే పెడుతున్నారని, మిగిలినవారి పేర్లు కనిపించవా? అంటూ జీవీఎల్ ప్రశ్నించారు. ఏపీలో జిల్లాల పున:ర్విభజన సమయంలో ఏదో ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని కోరినా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అన్నారు.

GVL Narasimha Rao : కేంద్ర పథకాలకు మీ స్టిక్కర్ వేసుకుంటే ఊరుకునేది లేదు-జీవీఎల్ నరసింహారావు

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కులాలకు అతీతంగా వంగవీటి రంగా పేరును ఓ జిల్లాకు పెట్టాలన్న జీవీఎల్.. రాష్ట్రంలో ప్రతి పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలినవారి పేర్లు పెట్టరా అంటూ ప్రశ్నించారు. సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందర్ని గౌరవించుకోవాలని అన్నారు.