ఏలూరులో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, కండీషన్ అప్లయ్
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రకటించొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఏలూరు ఎన్నికలపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీంతో రేపు(మార్చి 10,2021) పోలింగ్ కు మార్గం సుగమైంది.

highcourt green signal for eluru corporation polls: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రకటించొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఏలూరు ఎన్నికలపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీంతో రేపు(మార్చి 10,2021) పోలింగ్ కు మార్గం సుగమైంది.
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆఖరి నిమిషంలో ఎన్నికల రద్దు సరికాదని వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేసింది.
ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దాకే ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి సోమవారం(మార్చి 8,2021) మధ్యంతర ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ప్రభుత్వంతో పాటు మరికొందరు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.