నెల్లూరులో స్కూళ్లు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేత
కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ఏపీలోని నెల్లూరు జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. స్కూళ్లకు మార్చి 18వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే సినిమా థియేటర్లు

కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ఏపీలోని నెల్లూరు జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. స్కూళ్లకు మార్చి 18వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే సినిమా థియేటర్లు
కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ఏపీలోని నెల్లూరు జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. స్కూళ్లకు మార్చి 18వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే సినిమా థియేటర్లు మూసివేశారు. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో సభలు, సమావేశాలను రద్దు చేశారు. విజయవాడ నుంచి నెల్లూరుకు వచ్చిన రెండు ప్రత్యేక వైద్య బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఇద్దరు జాయింట్ డైరెక్టర్ల పర్యవేక్షణలో కరోనా నియంత్రణ చర్యలు సాగుతున్నాయి. 40 వైద్య బృందాలు నగరంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి. ఎవరైనా విదేశాల నుంచి వచ్చారా అన్నది ఆరా తీస్తున్నారు. మార్చి 6న ఇటలీ నుంచి నెల్లూరు చిన్నబజార్ కు వచ్చిన వ్యక్తికి కరోనా సోకింది. రిపోర్టులో అతడికి పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో అతడికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో ఇదే తొలి కరోనా కేసు.
స్కూళ్లు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ బంద్:
ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించడంతో జగన్ సర్కార్ హై అలెర్ట్ ప్రకటించింది. విశాఖలోని కృష్ణపట్నం పోర్టు, నెల్లూరులోని శ్రీహరికోట రాకెట్ కేంద్రాలను అప్రమత్తం చేసింది. నెల్లూరులో స్కూల్స్ కు సెలవులు ప్రకటించడమే కాకుండా అన్ని థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక మాల్స్‌ను సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని.. ప్రజలు ఎక్కువగా గుంపులుగా తిరగొద్దని.. బయటికి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం 9 మంది కరోనా బాధితులు ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతుండగా.. మరో 150 మంది కరోనా వైరస్ అనుమానితులు ఉన్నట్లు నెల్లూరు కలెక్టర్ తెలిపారు. రెండు ప్రత్యేక వైద్య బృందాలు వీరిని పర్యవేక్షిస్తున్నాయి.
అందరూ మాస్కులు వేసుకోవాల్సిన అవసరం లేదు:
నెల్లూరులో కరోనాను ఖతం చేసేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్. ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు నెల్లూరు జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మాస్కులు ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. జ్వరం, జలుబు..దగ్గు లక్షణాలు ఉన్నవారే ఇతరులకు వ్యాధి సోకకుండా మాస్కులు వేసుకోవాలని రాజేంద్రప్రసాద్ సూచించారు.