Nara Lokesh : ఎవరినీ వదలను.. అన్నీ నా ఎర్రబుక్కులో రాసుకుంటున్నా- నారా లోకేశ్ వార్నింగ్
Nara Lokesh : వైసీపీ ఫ్యాన్ పర్మినెంట్‌గా స్విచ్చాఫ్ చెయ్యండి. మీపై పడిన భారం తగ్గుతుంది. మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటా.

Nara Lokesh(Photo : Google)
Nara Lokesh – YS Jagan : యువగళం పాదయాత్రలో జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు నారా లోకేశ్. ఎవరినీ వదలను అంటూ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సింహపూరిలో యువగళం పాదయాత్రలో లోకేశ్ మాట్లాడారు. రాయలసీమ జిల్లాలో అడుగుపెట్టాక వైసీపీ నాయకులు వణికారు. నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టాక వారి ప్యాంట్లు తడిచిపోయాయి అని లోకేశ్ అన్నారు.
జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం అని లోకేశ్ విమర్శించారు. తల్లి చెల్లితో పాటు ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు. సాక్ష్యాత్తు బీసీ సంక్షేమ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికి 7 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆఫీసుకి తాళం వేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. విశాఖ క్రైం క్యాపిటల్ గా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా చెప్పారని లోకేశ్ గుర్తు చేశారు.(Nara Lokesh)
” ఆడపడుచుల మీద అకృత్యాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి? దగా పడ్డ ఆడపడుచులకు టీడీపీ అండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ బిల్లు చూస్తుంటే షాక్ కొడుతుంది. కరెంటు బిల్లు రూపంలో 11,300 కోట్ల భారం మోపారు జగన్. వైసీపీ ఫ్యాన్ పర్మినెంట్‌గా స్విచ్చాఫ్ చెయ్యండి. మీపై పడిన భారం తగ్గుతుంది. మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటా.
మహిళలకి ప్రత్యేకంగా ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం, ఉచిత ఆర్టీసీ ప్రయాణం ప్రవేశపెడతాం. జగన్ యువతని మోసం చేశారు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలిస్తాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రతి నిరుద్యోగికి భృతి ఇస్తాం. రైతులకి ప్రతి ఏటా రూ.20వేలు ఇస్తాం. బీసీలకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని విధాల ఆదుకుంటాం. అట్రాసిటీ చట్టం ప్రత్యేకంగా తెస్తాం. రెడ్డి సోదరులకి అండగా నిలబడింది పసుపు జెండా. వైసీపీ కోసం పాటుపడితే కనీస గౌరవం దక్కుతుందా అని ప్రశ్నిస్తున్నా.
ఆత్మకూరు పెన్నానదిని ఎనీ టైం శ్యాండ్ గా మార్చి దోచేస్తున్నారు. ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పేరు చెప్పుకుంటూ వైసీపీ నేతలు ఇసుక, గ్రావెల్ మాఫియాలుగా తయారయ్యారు. హాఫ్ నాలెడ్జ్ మంత్రి.. సోమశిలకి నిండా 78 టీఎంసీల నీటిని డ్రోన్ వీజువల్స్ కోసం పెట్టారు. వంద కోట్ల నష్టం తెచ్చిపెట్టారు. పేరుకే విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే. రిమోట్ అంతా వెంకటేశ్వర రెడ్డి చేతిలో ఉంది. నెల్లూరు గెస్ట్ హౌస్ కేంద్రంగా అనేక అక్రమాలు జరుగుతున్నాయి.
Also Read..Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
ఆత్మకూరులో అభివృద్ది కోసం కన్నింగ్ జగన్ ఎన్నో హామీలిచ్చారు. ఏదైనా అమలు చేశారా అన్నది ఆలోచించాలి. నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. ఎన్డీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు అయితే.. లోకేశ్ మూర్కుడు. తగ్గేదే లేదు. అన్నీ నా ఎర్రబుక్ లో రాసుకుంటున్నా” అని వార్నింగ్ ఇచ్చారు నారా లోకేశ్.