TTD Governing Body Meeting : ఉద్యోగులకు శుభవార్త.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే
ఫిబ్రవరిలో రెండు రోజులుపాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.

Bhumana karunakar reddy
Tirumala Tirupati Devasthanams : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. పోటు కార్మికులకు వేతనాలు రూ.10వేలు పెంచాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. శ్రీవారి ఆలయ పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాలకు ప్రతియేటా ఇచ్చే ప్యాకేజీ మరో కోటి రూపాయలకు పెంపు చేశారు. వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్ గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయించారు.
Also Read : TTD : తిరుమల వైకుంఠద్వార దర్శనం.. భక్తులు చలికి ఇబ్బంది పడకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
ఫిబ్రవరిలో రెండు రోజులుపాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. రిటైర్డ్ ఉద్యోగులు తదితరులకోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని తీర్మానించారు. శానిటేషన్ ఉద్యోగులు వర్క్ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కళ్యాణ కట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు.
Also Read : Telangana High Court : ‘వ్యూహం’ సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా.. సినిమా విడుదలపై స్టేకు నిరాకరణ
తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిది గృహాల నిర్మాణం టెండర్లకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. తిరుపతి పారిశుధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించాలని, జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీ ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనులకోసం రెండు కోట్ల కేటాయింపు.. శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు రూ.300 ప్రత్యేక దర్శనం కల్పించాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.