Corona India: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు కొత్తగా ఎన్నంటే?

శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Corona India: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు కొత్తగా ఎన్నంటే?

Covid

Updated On : January 30, 2022 / 9:11 AM IST

Corona India: భారత్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈమేరకు శనివారం విడుదల చేసిన Covid -19 హెల్త్ బులెటిన్ లో కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. రోజురోజుకి తగ్గుతున్న కేసుల సంఖ్యతో.. దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ 13.39%శాతానికి చేరుకోగా.. వారాంతపు పాజిటివిటీ రేటు 16.89% శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 871 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు. దింతో మహమ్మారి భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 493198కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 20,04,333 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

Also read: Gujarat family death: “అమెరికా కలే” వారికి మృత్యు శాపమైందా? మిస్టరీగా గుజరాత్ ఫ్యామిలీ మరణం

శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల మధ్య 3,35,939 మంది మహమ్మారి నుంచి కోలుకోగా మొత్తం ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,83,60,710 కు చేరింది. దేశంలో రికవరీ రేటు 93.89% శాతానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 17,59,434 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు మొత్తం 72.57 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేపట్టారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా 165.04 కోట్ల వాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

Also read: Loyal Employee: 70 ఏళ్లుగా ఒకే సంస్థలో ఉద్యోగం

వాక్సిన్ పంపిణీతోనే కరోనాను ధీటుగా ఎదుర్కొంటున్నట్టు ఐసీఎంఆర్ వివరించింది. ప్రస్తుతం దేశంలో నమోదు అవుతున్న కరోనా కొత్త కేసుల్లో అత్యధికశాతం “ఓమిక్రాన్ BA 2” బాధితులే ఉన్నట్లు ఐసీఎంఆర్ నివేదికలో పేర్కొంది. ఇక కేరళ, గుజరాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉండగా.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.