ఇంద్రకీలాద్రిలో సరస్వతి అలంకారంలో అమ్మవారు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఇంద్రకీలాద్రిలో సరస్వతి అలంకారంలో అమ్మవారు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

Indrakeeladri Saraswati Alankaram

Updated On : September 28, 2025 / 9:36 PM IST

Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో సోమవారం అర్ధరాత్రి వరకు సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా ఆదివారం రాత్రి 11 గంటల నుంచి భక్తులను క్యూ లైన్ లోకి అనుమతి ఇస్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సరస్వతి అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారు దుర్గమ్మ. మూడు లక్షలకు పైచిలుకు భక్తులు వస్తారని అంచన వేస్తున్నారు. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్య సమయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

Also Read: నవరాత్రులలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అలంకరణలు.. ఏయే అవతారాల్లో పూజిస్తారో తెలుసా?

సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీఠం వేస్తూ వీఐపీ, వీవీఐపీ దర్శనాలను రద్దు చేశారు. అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాలు మాత్రమే ఉంటాయి.