ISRO Chairman Somanadh : ఆగస్ట్ చివరి వారంలో ఆదిత్య ఎల్1 రాకెట్ ప్రయోగం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు చంద్రయాన్-3 కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 2.35 నిలకు చంద్రయాన్-3 రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు.

ISRO Chairman Somanadh : ఆగస్ట్ చివరి వారంలో ఆదిత్య ఎల్1 రాకెట్ ప్రయోగం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

ISRO Chairman Somanadh

Updated On : July 13, 2023 / 10:34 AM IST

Chandrayaan -3 Rocket Launch: భారత అంతరక్షం పరిశోధన కేంద్రం ఇస్రో చేపడుతున్న చంద్రయాన్ -3 ప్రయోగానికి సర్వంసి సిద్ధం చేసింది. మరికొద్ది సేపట్లో చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ లో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఇస్రో చైర్మన్ సోమనాధ్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతంకోసం ఇస్రో చైర్మన్ పూజలు చేశారు. అనంతరం సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Chandrayaan-3 Launch: చంద్రయాన్ -3 ప్రయోగం లైవ్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి ..

గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు చంద్రయాన్-3 కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 2.35 నిలకు చంద్రయాన్-3 రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. తిరుమలలో శ్రీవారికి ప్రత్యేక పూజల అనంతరం ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 ప్రయోగం చంద్రయాన్-1, చంద్రయాన్-2 ప్రయోగాలు‌కు పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ చంద్రయాన్-3 ప్రయోగాన్ని తలపెడుతున్నారని చెప్పారు. మరో వారంరోజుల వ్యవధిలో pslv-c57 రాకెట్ ప్రయోగం చేపట్టనున్నామని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఆగస్టు నెల చివరి వారంలో ఆదిత్య L1 రాకెట్ ప్రయోగం చేపడుతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.

Chandrayaan-3: చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి ఇన్ని రకాల మిషన్లా?.. ఇవి అత్యద్భుతం కదా?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్ -3 ఈనెల 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగానికి సిధ్దమైంది. ఈ మేరకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. మిషన్‌లో భాగంగా ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌తో చంద్రయాన్ -3 అంతరిక్ష నౌకను అనుసంధానించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ఉపగ్రహం సుమారు 3,84,000 కిలో మీటర్లు ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుకుంటుంది. ఆ తరువాత జాబిల్లి దక్షిణ ద్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవుతుంది. అంతా సవ్యంగా జరిగితే ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలిపింది.