Andhra Pradesh: ఏపీలో కొత్తగా 4,169 కరోనా కేసులు.. 53 మంది మృతి

అనంతపురం 262. చిత్తూరు 472. ఈస్ట్ గోదావరి 743. గుంటూరు 273. వైఎస్ఆర్ కడప 160. కృష్ణా 368. కర్నూలు 126. నెల్లూరు 236. ప్రకాశం 357. శ్రీకాకుళం 180. విశాఖపట్టణం 251. విజయనగరం 80. వెస్ట్ గోదావరి 659. మొత్తం : 4,169

Andhra Pradesh: ఏపీలో కొత్తగా 4,169 కరోనా కేసులు.. 53 మంది మృతి

Andhra Pradesh (4)

Updated On : June 22, 2021 / 6:01 PM IST

Andhra Pradesh: : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. వైరస్ కు చెక్ పెట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటికే కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో నిబంధనలు, ఆంక్షలను ప్రభుత్వం తొలగిస్తోంది.

తాజాగా..24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో 4 వేల 169 కరోనా కేసులు వెలుగు చూశాయి. 53 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53 వేల 880 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 416 మంది మృతి చెందారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 18,57,352 పాజిటివ్ కేసులకు గాను 17,91,056 మంది డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా మృతుల వివరాలు :

చిత్తూరులో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, వైఎస్ఆర్ కడపలో నలుగురు, నెల్లూరులో నలుగురు, విశాఖలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 262. చిత్తూరు 472. ఈస్ట్ గోదావరి 743. గుంటూరు 273. వైఎస్ఆర్ కడప 160. కృష్ణా 368. కర్నూలు 126. నెల్లూరు 236. ప్రకాశం 357. శ్రీకాకుళం 180. విశాఖపట్టణం 251. విజయనగరం 80. వెస్ట్ గోదావరి 659. మొత్తం : 4,169