KA Paul: కేసీఆర్ డ్రామాలు ఎవరూ నమ్మొద్దు.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుంటా
తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీ వదిలి బయటకురా. జనసేన పార్టీని, ప్రజాశాంతి పార్టీల విలీనం చేద్దాం అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ. పాల్ అన్నారు.

KA Paul
KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రైవేటీకరణ ఆపాలని కేంద్రానికి రెండేళ్ల క్రితమే లేఖ రాశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (Prajashanthi Party President KA Paul) అన్నారు. బుధవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంపై, సీఎం కేసీఆర్ (CM KCR) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) కి ఇస్తామన్న హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అమెరికన్ ఫండ్ (American Fund) నేరుగా కేంద్ర ప్రభుత్వం (Central Government) కు నేనే ఇస్తానని, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటానని అన్నారు. కేంద్రానికి ఇష్టం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మేయాలంటూ పాల్ సూచించారు. భూమిని తక్కువ ధరకు అమ్మేయాలని చూస్తున్నారని పాల్ విమర్శించారు.
KA Paul: రాహుల్ గాంధీపై అనర్హత వేటు సిగ్గు చేటు.. ప్రపంచం నవ్వుతోంది.. బండి సంజయ్‌పై పిటిషన్ వేస్తా
తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన డ్రామాలు ఎవరూ నమ్మొద్దంటూ కేఏ పాల్ ప్రజలను కోరారు. తెలంగాణను కాపాడలేని నువ్వు.. స్టీల్ ప్లాంట్‌ని కాపాడుతావా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దంటూ సూచించారు. కేసీఆర్ అందరికంటే ఎక్కువ దోచుకున్నాడని, తోట చంద్రశేఖర్‌కి 100 కోట్లు ఇచ్చాడని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు వెయ్యి కోట్లు ఇచ్చాడంటూ కే.ఏ. పాల్ ఆరోపణలు చేశారు. ఏపీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాడంటూ విమర్శించారు.
KA Paul : కేసీఆర్, కేటీఆర్‌లు జీవితాంతం ముఖ్యమంత్రులుగా ఉంటారని అనుకోకండి-కేఏ పాల్
దొంగలు కావాలంటే ఇప్పుడున్న పార్టీల్ని ఎన్నుకోండి, మంచి పాలన కావాలంటే ప్రజాశాంతి పార్టీకి మద్దతుగా నివాలని పాల్ ప్రజలను కోరారు. పవన్ కళ్యాణ్‌కు పాల్ ఓ విజ్ఞప్తి చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్.. బీజేపీ వదిలి బయటకురా. జనసేన పార్టీని, ప్రజాశాంతి పార్టీల విలీనం చేద్దాం. నా ప్రతిపాదనకు అంగీకారం తెలపండి అంటూ పవన్ కళ్యాణ్‌ను కోరుతున్నా అని కేఏ పాల్ అన్నారు.