Kottu Satyanarayana: రూ.5 లక్షల ఆదాయం చొప్పున వచ్చే 23,600 ఆలయాలను గుర్తించాం.. వాటన్నింటినీ..

ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడితే కొందరు తనపై వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొట్టు సత్యనారాయణ అన్నారు.

Kottu Satyanarayana: రూ.5 లక్షల ఆదాయం చొప్పున వచ్చే 23,600 ఆలయాలను గుర్తించాం.. వాటన్నింటినీ..

Kottu Satyanarayana

Updated On : August 22, 2023 / 5:41 PM IST

Kottu Satyanarayana – YCP: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో రూ.5 లక్షల ఆదాయం చొప్పున వచ్చే 23,600 ఆలయాలను గుర్తించామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. వాటన్నింటినీ నిర్వహణకు అప్పగించేందుకు కేవలం 37 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. అమరావతిలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు.

ఆయా ఆలయాలకు ధూప దీప నైవేద్య కార్యక్రమాలు నిర్వహించే అంశంపై యథావిధిగా కార్యాచరణ ఉంటుందని కొట్టు సత్యనారాయణ చెప్పారు. ధర్మ ప్రచార కార్యక్రమం ఏడాది పొడవునా చేపట్టేలా చేస్తామన్నారు. దీంతో స్థానిక కళాకారులకు కూడా చేయూతగా ఉంటుందని చెప్పారు.

ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడితే కొందరు తనపై వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొట్టు సత్యనారాయణ అన్నారు. దేవాదాయ శాఖకు చెందిన ఏ భూమి అయినా తాము చట్టపరంగా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. అన్యాక్రాంతం అయ్యేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 4.60 లక్షల ఎకరాల భూమి దేవాదాయ శాఖదేనని చెప్పారు. 1.65 లక్షల గజాల వాణిజ్య స్థలం ఆక్రమణలో ఉందని తెలిపారు.

దేవాదాయ శాఖకు చెందిన ఏ భూమి అయినా చట్టపరంగా స్వాధీనం చేసుకునేలా ఆర్డినెన్సు తీసుకువచ్చామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభ పడిపోతుందని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకే ఆయన ఇతర పార్టీలో కలిసి పోటీ చేస్తానంటున్నారని కొట్టు సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేత లోకేశ్ చేస్తుంది యువగళం పాదయాత్ర కాదని, అది గందరగోళం పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే ఓటర్ల జాబితాను తనిఖీ చేయిస్తోందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఈసీకి ఫిర్యాదు చేస్తే ఒరిగేది ఏమీ లేదని చెప్పారు.

Posani Krishna Murali : ఖబడ్దార్‌ లోకేశ్‌.. నారా లోకేశ్‌కు పోసాని కృష్ణ‌ముర‌ళి స్ట్రాంగ్ వార్నింగ్