నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టు: ఐదవ పెళ్లిలో మూడో భార్య ఫిర్యాదు

అనంతపురంలో నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టు అయ్యింది. నలుగురు అమ్మాయిల్ని మోసం చేసి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఐదవ పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు. ఎంత తెలివిగా మోసాలు చేసినా ఎప్పుడోకప్పుడు బైటపడక తప్పదు. గుట్టు రట్టైంది.
వివరాల్లోకి వెళితే..రంగప్ప అనే వ్యక్తికి ఏ ఉద్యోగం లేదు. దీంతో అమ్మాయిల్ని ట్రాప్ లో వేసి పెళ్లిళ్లు చేసుకోవటం మొదలు పెట్టాడు. మోసాలు చేయటమే పనిగా పెట్టుకున్నాడు. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న రంగప్ప అనంతపురానికి చెందిన అమ్మాయితో ఐదవ పెళ్లికి రెడీ అయ్యాడు. ఇది తెలిసిన మూడవ భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు రంగప్పను అరెస్ట్ చేశారు. దీంతో నిత్య పెళ్లి కొడుకు కటకటాల పాలయ్యాడు. తమైన శైలిలో పోలీసులు విచారించగా రంగప్ప మోసాలు ఒక్కటొక్కటిగా బైటపెట్టాడు.
పెళ్లిళ్ల పేరుతో అమ్మాయిల్ని మోసం చేయటమే కాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తానంటు పలువురి వద్ద డబ్బులు భారీగా దండుకున్నాడు. నిరుద్యోగుల బలహీనతను ఆసరగా చేసుకుని పలువుని నుంచి రూ.10లక్షలు వసూలు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
రంగప్ప పెళ్లిళ్లు హవా
బూదివాండ్లపల్లికి చెందిన రంగప్పకు మొదటి వివాహం తల్లిదండ్రులు చేయగా..రెండవ పెళ్లి దేవన హళ్లిలోను…మూడవ పెళ్లి హిందూపురంలో..మూడవ పెళ్లి గోరంట్లలో..నాలుగవ పెళ్లి చేసుకున్నాడు. తనకు ఎవ్వరూ లేరనీ తాను అనాథనని..చెప్పి పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ క్రమంలో అనంతపురానికి చెందిన యువతితో నవంబర్ ఐదున ఐదవ పెళ్లికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మూడవ భార్య హిందూపురం పోలీస్ స్టేషన్లో ఫర్యాదు చేయటంతో నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టు అయ్యింది.