Merge : ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేయాలి.. కేసీఆర్‌కు మంత్రి సూచన

తెలంగాణ మంత్రివర్గంతో కేసీఆర్ చర్చించాలి. రెండు రాష్ట్రాలను కలిపేందుకు ఓ తీర్మానం చేయాలి. ఈ అంశంలో సీఎం కేసీఆర్ ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.

Merge : ఏపీ, తెలంగాణను మళ్లీ కలిపేయాలి.. కేసీఆర్‌కు మంత్రి సూచన

Perni Nani

Updated On : October 28, 2021 / 9:30 PM IST

Perni Nani : తెలంగాణలో తాము చేస్తున్న అభివృద్ధి చూసి ఆంధ్రప్రదేశ్‌‌లో కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని చాలామంది ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీలో అన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీశాయి. దీనిపై ఆంధ్రా లీడర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఏపీలోనూ కేసీఆర్ పార్టీ పెట్టుకోవచ్చన్నారు. తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మంత్రి పేర్ని నాని.. కేసీఆర్ ఏపీలో పార్టీ పెడితే మంచిదేనని, తాము కూడా అదే కోరుకుంటున్నామని అన్నారు.

LPG Price: వారం రోజుల్లో మరో రూ.100 పెరగనున్న వంట గ్యాస్

కేసీఆర్ పార్టీ పెడతామంటే తమకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. అయితే, “రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు…. రెండు రాష్ట్రాలను మళ్లీ కలిపేసి కేసీఆర్ పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది” అని అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసిపోయాక కేసీఆర్ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని అన్నారు.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

“దీనిపై తెలంగాణ మంత్రివర్గంతో కేసీఆర్ చర్చించాలి. రెండు రాష్ట్రాలను కలిపేందుకు ఓ తీర్మానం చేయాలి. ఈ అంశంలో సీఎం కేసీఆర్ ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ఒకే రాష్ట్రంగా ఉండొచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నది మా సీఎం అభిమతం కూడా. సమైక్య రాష్ట్రం అనేది తెలుగు వాళ్లకు అవసరం అని సీఎం జగన్ 2013లోనే చెప్పారు. ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టద్దని ఆనాడే చెప్పారు” అని మంత్రి పేర్ని నాని అన్నారు.