AP Weather Alert: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఇవాళ ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు.. 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
రాష్ట్రంలో పలు జిల్లాలో సోమవారం అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదేక్రమంలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

AP Rain Alert
AP Rain Alert: రాష్ట్రంలో పలు జిల్లాలో సోమవారం అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదేక్రమంలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇవాళ 11 మండలాల్లో వడగాలుల ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని, మరో 98 మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ విభాగం తెలిపింది.
Also Read: Amaravati Project : 65వేల కోట్లతో అమరావతి ప్రాజెక్ట్.. భూమి పూజకు ప్రధాని మోదీకి ఆహ్వానం..!
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అకాలవర్షంకు తోడు ఈదురు గాలులు, వడగండ్ల వానలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9గంటల మధ్య అత్యధికంగా అనకాపల్లిలో 54.75 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఏలూరు, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో కళ్లాల్లోని మిరప, వరి పంటలకు అధి నష్టం వాటిల్లింది. మొక్కజొన్న పంటసైతం అనేక ప్రాంతాల్లో దెబ్బతింది.
Also Read: TTD Hair Auction Revenue : టీటీడీకి తలనీలాల వేలం మీద ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా?
రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో పెద్దెత్తున ఈదురుగాలులకుతోడు వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.
మరోవైపు.. ఏపీలో ఎండతీవ్రత ఎక్కువగానే ఉంటుందని, 11 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని, మరో 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కాకినాడ జిల్లాలో మూడు మండలాల్లో, కోనసీమ జిల్లాలో ఏడు మండలాల్లో, తూర్పు గోదావరి గోకవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది. అలాగే.. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు గోదావరి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.8డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట, పల్నాడు జిల్లా రావిపాడులో 41.4 డిగ్రీలు, 54 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.