చురుగ్గా నైరుతి కదలిక.. ఆ జిల్లాల్లో రెండ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు..
ఆ ప్రాంతాల్లో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Rains: ఏపీలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల్లో కదలిక రావడంతో మధ్య, తూర్పు భారతం వరకు అనేక ప్రాంతాల్లో వర్షాలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని ఆయా జిల్లాల్లో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read: Tollywood : సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. పవన్ తో కలిసి.. ఎప్పుడంటే..? ఏ ఏ అంశాలు చర్చించనున్నారు..?
నైరుతి రుతుపవనాల్లో కదలికతో పాటు ఉపరిత ద్రోణి ప్రభావంతో ఏపీలో రెండ్రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో ఇవాళ (శుక్రవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
నైరుతి రుతుపవనాలుచురుగ్గా కదులుతున్న కారణంగా.. వర్షాలు పడే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ఆకస్మిక వర్షాలు, పిడుగుల నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.