Ambati Rambabu : పవన్ పొత్తు ధర్మం వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అంబటి .. తమ్ముడూ అంటూ ప‌వ‌న్‌కు సలహా

టీడీపీని ఉద్దేశిస్తూ పవన్ చేసిన పొత్తుధర్మం వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాయుడు స్పందించారు.

Ambati Rambabu : పవన్ పొత్తు ధర్మం వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అంబటి .. తమ్ముడూ అంటూ ప‌వ‌న్‌కు సలహా

Ambati Rambabu

Updated On : January 26, 2024 / 1:02 PM IST

AP Politics : జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన పొత్తు అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పొత్తు ధర్మం తప్పిందంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను పవన్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. టీడీపీ పొత్తు ధర్మం తప్పిందని, అందుకు జనసేన నేతలు, కార్యకర్తలకు క్షమాపణలు చెబుతున్నాని అన్నారు. పొత్తులో ఉన్నప్పటికీ ఎలాంటి సమాచారం లేకుండా రెండు సీట్లను టీడీపీ అనౌన్స్ చేయడం పట్ల పవన్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఒత్తిడి ఉన్నట్లుగా నాపైనా ఒత్తిడి ఉందని.. తప్పనిపరిస్థితుల్లో టీడీపీ తరహాలో జనసేన పోటీ చేసే రెండు నియోజకవర్గాలను ప్రకటిస్తున్నట్లు పవన్ తెలిపారు.

Also Read : Pawan Kalyan : జనసేన పోటీచేసే రెండు స్థానాలను ప్రకటించిన పవన్ కల్యాణ్.. టీడీపీ పొత్తుధర్మం తప్పిందంటూ వ్యాఖ్య

రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని, రాజానగరం రేసులో బత్తుల బలరామకృష్ణ, రాజోలు రేసులో బొంతు రాజేశ్వరరావు, వరప్రసాద్, డీఎంఆర్ శేఖర్ ఉన్నారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. టీడీపీని ఉద్దేశిస్తూ పవన్ చేసిన పొత్తుధర్మం వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాయుడు స్పందించారు. ట్విటర్ వేదికగా తమ్ముడూ పవన్ అంటూ ఓ సలహా ఇచ్చారు. అంబటి ట్వీట్ ప్రకారం.. పొత్తు ధర్మమే కాదు.. ఏ ధర్మమూ పాటించని వాడే ‘బాబు’ అంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుసుకో తమ్ముడూ పవన్ కల్యాణ్ అంటూ అంబటి పవన్ కు సూచన చేశారు.

Also Read : YS Sharmila : అందుకు సాక్ష్యం మా అమ్మే.. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి.. వైసీపీ నేతలపై షర్మిల ఫైర్