Kodali Nani : రాజధాని వికేంద్రీకరణ జరగాల్సిందే, అమరావతి కూడా ఉంటుంది- మంత్రి కొడాలి నాని

సెక్రటరియేట్ విశాఖలో, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదని, అలాగే అమరావతి కూడా ఉంటుందని అన్నారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని..

Kodali Nani : రాజధాని వికేంద్రీకరణ జరగాల్సిందే, అమరావతి కూడా ఉంటుంది- మంత్రి కొడాలి నాని

Kodali Nani Amaravathi

Updated On : December 21, 2021 / 6:26 PM IST

Kodali Nani : రాజధాని అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజధాని గురించి అధికార, ప్రతిపక్ష నేతలు రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్నారు. తమ ప్రకటనలతో మరింత హీట్ పెంచుతున్నారు. రాజధాని వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అధికార పార్టీ నేతలు అంటుంటే, రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉండాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.

Hairfall: తక్కువ వయస్సులోనే జుట్టు ఊడిపోవడానికి కారణాలు

తాజాగా మూడు రాజధానులు, అమరావతిపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణ తథ్యం అన్న మంత్రి కొడాలి నాని.. అమరావతి కూడా ఉంటుందని తేల్చి చెప్పారు. సెక్రటరియేట్ విశాఖలో, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదని, అలాగే అమరావతి కూడా ఉంటుందని కొడాలి నాని అన్నారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని మంత్రి స్పష్టం చేశారు. అమరావతి అందరిదీ అంటున్న వాడు అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకున్నారంటూ టీడీపీపై పరోక్షంగా మండిపడ్డారు.

Whatsapp : వాట్సాప్‍‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు..!

అమరావతి పరిరక్షణకు పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామినీ పూజిస్తే, పరమేశ్వరుడే ఉండే అమరావతిని ఆయన ఆశీర్వదిస్తారని… కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెట్టిన రాజధాని అమరావతి అని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు జగన్ ప్రభుత్వానికి ఒక్కటేన‌ని… 30వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో అమరావతి ఏర్పాటు చెయ్యాలని నాడు ప్రతి పక్ష నేతగా జగన్ చెప్పారని మంత్రి గుర్తు చేశారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. తన వాళ్లకు లబ్ది చేకూర్చేందుకే ల్యాండ్ పూలింగ్ పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని, అమరావతి పేరుతో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని కొడాలి నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.