AP New Ration Cards : ఏపీలో త్వరలో ఇచ్చే కొత్త రేషన్ కార్డులు ఇవే.. సరికొత్త డిజైన్‌, ప్రత్యేకతలు ఏంటంటే..

మా డిపార్ట్ మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కొత్త కార్డులు ముఖ్యమంత్రికి చూపించాము.

AP New Ration Cards : ఏపీలో త్వరలో ఇచ్చే కొత్త రేషన్ కార్డులు ఇవే.. సరికొత్త డిజైన్‌, ప్రత్యేకతలు ఏంటంటే..

Updated On : April 1, 2025 / 6:41 PM IST

AP New Ration Cards : ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ మేరకు కొత్త రేషన్ కార్డులను సిద్ధం కూడా చేసింది. రేషన్ కార్డు బదులు రైస్ కార్డ్ పేరుతో వాటిని జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల.. కొత్త రేషన్ కార్డు డిజైన్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. అందులోని ప్రత్యేకతలను కూడా ఆయన వివరించారు.

కొత్త రేషన్ కార్డుని ఇకపై రైస్ కార్డ్ అని పిలుస్తారు. ఈ కార్డు ఏటీఎం కార్డ్ సైజులో ఉంది. ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంది. అది సేఫ్టీ ఫీచర్. ఇక కార్డు బ్యాక్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ డీటైల్స్ ఉంటాయి. ఈ కొత్త కార్డుకు సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వివరాలు తెలిపారు.

Also Read : గుడ్‌న్యూస్‌.. మెగా డీఎస్సీ, ఉద్యోగాల నియామకంపై చంద్రబాబు కీలక ప్రకటన

”కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్ కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రైస్ కార్డ్స్ తీసుకురాబోతున్నాం. మా డిపార్ట్ మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కొత్త కార్డులు ముఖ్యమంత్రికి చూపించాము. ఆ కొత్త కార్డులు ఇవే. క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. ఏటీఎం కార్డులా ఉంది. ఇందులో క్యూఆర్ కోడ్ కూడా
ఉంటుంది. అది సేఫ్టీ ఫీచర్. ఈ కార్డ్ ను కొత్తగా లాంచ్ చేయబోతున్నాం. ఒక సిస్టమాటిక్ విధానంలో లాంచ్ చేయబోతున్నాం.

Also Read : ఏపీలో కటిక పేదరికం నుంచి బయటపడేది వీళ్లే.. ఆ గ్రామంలో పీ4 లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు

కార్డ్ బ్యాక్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ డీటైల్స్ ఉంటాయి. గతంలో కన్నా చాలా క్లియర్ గా అక్షరాలు ఉంటాయి. గతంలో రేషన్ కార్డ్ పెద్దదిగా ఉన్నా అందులో పేర్లు, వివరాలు ఏవీ స్పష్టంగా కనిపించేవి కాదు. ఇందులో అలా కాదు. చాలా క్లియర్ గా వివరాలు కనిపించేలా ఏర్పాట్లు చేశాం. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి అనేది ఈ కేవైసీ ద్వారా పూర్తవుతుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ కేవైసీకి కేంద్రం గడువు ఇచ్చింది.

ఇప్పటివరకు 93శాతం పూర్తైంది. వేసవి లో ఎవరికీ ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. గ్రామ వార్డు సచివాలయాల్లో మొబైల్ యాప్ లో ఈ కేవైసీ నమోదు చేసుకోవచ్చు. రేషన్ ఇస్తున్న డీలర్ల దగ్గర ఉన్న ఈపాస్ మిషన్ లోనూ నమోదు చేసుకోవచ్చు. మా కూటమి ప్రభుత్వం ఎక్కడా ఫోటోలు పెట్టలేదు. ప్రతి ఒక్కరిని గౌరవించుకునేలా, ఒక సిస్టమాటిక్ గా కార్డులు తయారు చేస్తున్నాం. రైస్ కార్డ్ నుంచి రేషన్ కార్డ్.. రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డ్ గా మారిపోయింది. మల్టీపర్పస్ కార్డ్ గా మారిపోయింది. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి.

మే నెల నుంచి ఏటీఎం కార్డ్ సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. కుటుంబసభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తాం. క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లతో కొత్త కార్డులు ఇస్తాం. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే కొత్త కార్డ్స్ జారీ చేస్తాం” అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.