Nara Lokesh: ఇకపై రప్పా రప్పా అంటే పోలీసులు రఫ్ఫాడిస్తారు, వైసీపీ నాయకులకు మంత్రి లోకేశ్ వార్నింగ్

తిరుపతిలో దళిత యువకుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడిని తీవ్రంగా ఖండించారు లోకేశ్.

Nara Lokesh: ఇకపై రప్పా రప్పా అంటే పోలీసులు రఫ్ఫాడిస్తారు, వైసీపీ నాయకులకు మంత్రి లోకేశ్ వార్నింగ్

Updated On : August 7, 2025 / 8:03 PM IST

Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై రప్పా రప్పా అంటే ఏపీ పోలీసులు మిమ్మల్ని రఫ్ఫాడిస్తారు అని హెచ్చరించారు. ప్రజలు ఛీత్కరించినా వారి బుద్ధి మారడం లేదని లోకేశ్ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ డోర్ డెలివరీ వరకూ దళితులపై దమనకాండ జరిపిన వైసీపీ నేతలు ఇప్పుడు కూడా అదే పందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తిరుపతిలో దళిత యువకుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడిని తీవ్రంగా ఖండించారు లోకేశ్. ఇటువంటి దాడులకు రాష్ట్రంలో చోటు లేదన్నారు.

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 లోని రప్పా రప్పా డైలాగ్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ అధినేత జగన్ గుంటూరు పర్యటన సందర్భంగా ర్యాలీలో వెలసిన ఈ రప్పా రప్పా డైలాగ్‌ ప్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్‌లో జగన్‌ కూడా ఈ రప్పా రప్పా డైలాగ్‌ను వాడటం మరింత ప్రభావం చేసింది. దీంతో ఏపీలో ఈ డైలాగ్ పొలిటికల్ ట్రెండ్‌గా మారింది.

రప్పా రప్పా డైలాగ్ పోస్టర్ పట్టుకున్న వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టడం చిచ్చు రాజేసింది. దీనిపై జగన్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వంలో సినిమాలోని డైలాగ్ చెప్పడం కూడా తప్పేనా? అని ఎదురుదాడికి దిగారు. గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం.. అని జగన్‌ డైలాగ్‌ చెప్పారు. పుష్ప సినిమా డైలాగులు, పుష్ప సీన్లు, తగ్గేదేలే పుష్ప అని మేనరిజం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు? మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? అని జగన్‌ ప్రశ్నించారు.

అది మొదలు.. అప్పటి నుంచి టీడీపీ, వైసీపీ నేతల మధ్య రప్పా రప్పా డైలాగ్ గురించి మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు రప్పా రప్పా ఆడిస్తామని వైసీపీ నాయకులు వరుసగా వార్నింగ్ లు ఇస్తున్నారు.

Also Read: 50ఏళ్లకే పెన్షన్, ఉచిత విద్యుత్, అదనంగా రూ.25వేలు.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్