పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా మళ్లీ పిలుస్తాం- మంత్రి నారాయణ

ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలలోపు పూర్తి కావాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు అని మంత్రి నారాయణ తెలిపారు.

పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా మళ్లీ పిలుస్తాం- మంత్రి నారాయణ

Updated On : November 4, 2024 / 7:01 PM IST

Minister Narayana : రాజధాని భవనాల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో 39వ సీఆర్డీఏ అథారిటీ మీటింగ్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఇందులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. చీఫ్ ఇంజినీర్ల సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్ నుంచి మళ్లీ పనులు ప్రారంభిస్తామన్న నారాయణ.. హైకోర్టు, అసెంబ్లీ ఐకానిక్ భవనాలు మినహా.. మిగిలినవి మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాజధానితో మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు.

”2014-19లో టెండర్లు చేశారో.. వాటిని క్లోజ్ చేయకుండా టెండర్లు పిలవలేము. బిల్లులు ఫైనల్ కావాలి. అవన్నీ క్లోజ్ చేయాలి. అమరావతి రాజధాని ముందుకు పోవాలంటే.. అతి కీలకమైనది టెండర్ల వ్యవహారం. చీఫ్ ఇంజినీర్ల సాంకేతిక కమిటీ రిపోర్టును సీఆర్డీఏ అప్రూవ్ చేసింది. పాత టెండర్లు రద్దు చేయాలని కమిటీ సూచించింది. పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా మళ్లీ పిలుస్తాం. డిసెంబర్ ఎండింగ్ లోపల అన్ని టెండర్లు పిలవాలని ఆదేశించడం జరిగింది. ఐకానిక్ టవర్లు హైకోర్టు, అసెంబ్లీ మినహా మిగిలిన అన్ని టెండర్లను డిసెంబర్ ఎండింగ్ కి క్లోజ్ చేస్తాం. జనవరి ఎండింగ్ లోపు టెండర్లు పిలుస్తాం. ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలలోపు పూర్తి కావాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు” అని మంత్రి నారాయణ తెలిపారు.

అమరావతి రాజధానిపై సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణ పనుల వేగవంతంపై అధికారులతో చర్చించారని వెల్లడించారు. ప్రపంచలోని ముఖ్యమైన ఐదు నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Also Read : విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటా: పవన్ సంచలన కామెంట్స్‌