Payyavula Keshav: ఆర్థిక వ్యవస్థపై జగన్, బుగ్గన ట్వీట్లు, ప్రెస్ మీట్లు కుట్రలో భాగమే- మంత్రి పయ్యావుల సంచలన వ్యాఖ్యలు
ఇది ప్రజల మీద జరిగిన కుట్ర. ఇది దేశ ద్రోహ నేరంగా పరిగణించాలని సీఎంను కోరతా.

Payyavula Keshav: పది రోజులుగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై వల్లమాలిన ప్రేమ చూపుతున్నారని, వారి గగ్గోలు వెనుక అసలు వాస్తవాలు చెప్పాలని తాను వచ్చానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వారి ట్వీట్లు, ప్రెస్ మీట్లు కుట్రలో భాగంగా చేస్తున్నవే అని ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ను డే అండ్ నైట్ బిల్డ్ చేయాలని చంద్రబాబు అనుకుంటుంటే.. వారి వైఖరిలో మాత్రం మార్పు లేదని మండిపడ్డారు. తమకు ఓట్లు వేయలేదనే బాధను, అక్కసును ప్రజల మీద చూపుతున్నారని చెప్పారు.
”రాష్ట్రంలో ఖజానాను దెబ్బతీయాలని చూస్తున్నారు. ఏపీ ఎండీసీకి 9వేల కోట్ల లోన్లను రైజ్ చేయాలని నిర్ణయించి జీవో ఇచ్చాము. ఈ జీవో ఇవ్వగానే ఉదయభాస్కర్ అనే వ్యక్తిని తెరమీదకు వచ్చారు. ఆయనతో 200 మెయిల్స్ పెట్టించారు. ఆయన డీపీ జగన్ ఫోటో ఉంటుంది. 200 పైచిలుకు ఈ మెయిల్స్ ను ప్రపంచవ్యాప్తంగా పెట్టారు. అయినా ఇన్వెస్టర్లు మాత్రం పట్టించుకోలేదు. గవర్నర్ పేరు చెప్పి ఉల్లంఘనలు జరిగాయని గవర్నర్ కు ఫిర్యాదు చేశాం. కేంద్రానికీ చెప్పాం.
బుగ్గన ఎందుకో గంటలు గంటలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఉదయ భాస్కర్ ను పట్టించుకోకపోవడంతో లేళ్ల అప్పిరెడ్డిని తెరపైకి తెచ్చి పిల్స్ వేశారు. వారే మెయిల్స్ పెడతారు, వారే ఈ వంకన కోర్టుకు వెళతారు. పెట్టుబడులు పెట్టొద్దని చెబుతారు. చివరకు ఫైనాన్స్ కమిషన్ లో మెంబర్ గా ఉన్న వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కంప్లెయింట్ చేశారు. సెబీ ఎంక్వైరీ చేసుకొని ఇదంతా తప్పని తేల్చి చివరకు లోన్ ఇచ్చింది. మీరు ఏం చేయగలిగారు? కేవలం 15 రోజులు విలువైన సమయాన్ని ఆపగలిగారు. ఇది ప్రజల మీద జరిగిన కుట్ర. ఇది దేశ ద్రోహ నేరంగా పరిగణించాలని సీఎంను కోరతా.
మీ ఫిర్యాదులో సెబీ, ఆర్బీఐ క్లియర్ చేసింది చివరకు ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యింది. ఇక మీ ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు? డైరెక్ట్ డెబిట్ మెకానిజంను అసలు ఇంట్రడ్యూస్ చేసింది మీరేగా. మధ్యలో మీరు చేసింది డైరెక్ట్ డెబిట్ మెకానిజమే కదా? ఇప్పుడు దేశం మొత్తం దీన్ని ఫాలో అవుతుంది. మీ కడుపు నొప్పికి వుడ్ వర్డ్స్, కడుపు మంటకు జెలుసిల్ ఇవ్వాలా? నేను అప్పట్లో రైజ్ చేసిన అంశాలపై సీఎస్ స్పందించారు. ఆర్ధిక మంత్రి నిర్మల దేశం మొత్తం సర్కులర్ ఇచ్చారు. జీవో నెంబర్ 22ను 11-3-2025న ఇచ్చాము. జీవో నెంబర్ 35ను బుగ్గన ఇచ్చి 7వేల కోట్లు అడిగారు.
మా మీద ఉన్న నమ్మకంతో 9వేల కోట్లకు వెళ్లినా ఓవర్ సబ్ స్క్రైబ్ చేశారు. ఇంత జరిగాక కూడా బుగ్గన ప్రెస్ మీట్, జగన్ ట్వీట్.. ఇక ఆపండి. ఆర్బీఐ, సెబీ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఇంకా ఎందుకు మీ ఏడుపులు? 95 పథకాలను వారు ఆపేస్తే మేము 75 పథకాలు పెట్టి కేంద్రం స్కీమ్ లను రన్ చేశాం. వర్క్ బిల్లులు, ఎంప్లాయిస్ కు 7వేల కోట్లు వరకూ చెల్లించాం. కేంద్రం ఆక్సిజన్ ఇస్తోంది గనుక మనం సర్వైవ్ అవుతున్నాం.
జీతాలు, హెచ్ఆర్ బిల్లు కలిపి 99 శాతం ఉంది. తెలంగాణలో 40శాతం మాత్రమే. ఒక సంవత్సరం అయితే 107కి చేరింది. దాన్ని 7శాతం అప్పు చేసి చేశాం. మా బాధ్యత ప్రతి నిముషం గుర్తుంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఒక పార్టీకి అఫ్లియేటెడ్. వెంకటరామిరెడ్డి ఆరోపణలు పట్టించుకోము” అని పయ్యావుల కేశవ్ అన్నారు.