Peddi reddy Ramachandra reddy : ఎన్ని జెండాలు కలిసినా మాది మాత్రం ఒక జెండాయే : మంత్రి పెద్దిరెడ్డి
పొత్తుల గురించి పవన్ ఇచ్చిన క్లారిటీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతు.. ఉమ్మడి పొత్తుకు బీజేపీ అంగీకరించలేదేమో అందుకే పవన్ టీడీపీతో జతకలుస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

peddireddy ramachandrareddy
Peddi reddy Ramachandra reddy : రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు (chandrababu)తో ములాఖత్ పూర్తి అయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) మీడియాతో పొత్తులపై కుండబద్దలు కొట్టారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వార్తలపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు. దీంతో వైసీపీ సోషల్ మీడియాతో పాటు వైసీపీ నేతలంతా దుయ్యబడుతున్నారు. పవన్ పై విమర్శలు సంధిస్తున్నారు. సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. ప్యాకేజీ బంధం బయటపడిందని..ఈ పొత్తులు మమ్మల్ని ఏమీ చేయలేవని..పవన్ పరామర్శకు వెళ్ళాడా..? డీల్ మాట్లాడుకోవడానికి వెళ్ళాడా..? అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. అలాగే పవన్ మాటలు నమ్మేందుకు ఎవ్వరు సిద్ధం లేరు ఇక ప్రజలు టీడీపీ, జనసేనలను రాష్ట్రం నుంచి తరిమికొడతారు అంటూ విమర్శిస్తున్నారు.
Pawan Kalyan : పొత్తులపై కుండబద్దలు కొట్టిన పవన్ కల్యాణ్ .. కలిసే పోటీ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు
అలాగే పొత్తుల గురించి పవన్ ఇచ్చిన క్లారిటీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandrareddy)స్పందించారు. నిన్నటి వరకు పవన్ బీజేపీతోనే ఉన్నారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు అంటున్నారు. అంటే ఉమ్మడి పొత్తుకు బీజేపీ అంగీకరించలేదేమో అందుకే పవన్ టీడీపీతో జతకలుస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని జెండాలు కలిసి వచ్చినా మాది మాత్రం ఒక్క జెండానే అన్నారు. గత ఎన్నికల్లో కూడా అన్ని జెండాలకు ఎదురెళ్లి గెలిచామని గుర్తు చేశారు.
చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) స్కాంకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారన్నారు. గతంలో సీఎం వైఎస్ జగన్ ఎక్కడా సచివాలయంకు ఒక్కసారి కూడా రాకపోయినా అరెస్ట్ చేశారన్నారు. బాలకృష్ణతో పాటు, వాళ్ళ అల్లుడు, ఇంకెవరైనా కలిసి వచ్చినా కూడా వైసీపీ విజయం తథ్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Pawan Kalyan : అన్యాయంగా రిమాండ్‌కు పంపారు,చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చా : వవన్ కల్యాణ్