ఏపీలో కరోనా కల్లోలం… రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

  • Published By: sreehari ,Published On : August 27, 2020 / 07:50 PM IST
ఏపీలో కరోనా కల్లోలం… రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు

Updated On : August 27, 2020 / 8:13 PM IST

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. యాంటీ ర్యాపిడ్ టెస్టులు చేస్తుండటంతో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ 10 వేలకు పైగా నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 92 మంది మరణించరాు.



రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 61,300 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.. అందులో 10,621 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 3,93,090కు చేరాయి..

కరోనా వైరస్ మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 92 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,633కు పెరిగింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 13 మంది, తూర్పు గోదావరిలో 10 మంది, అనంతపురంలో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, కృష్ణాలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో నలుగురు మరణించారు.



అలాగే విశాఖపట్నంలో ఆరుగురు, కడపలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, నెల్లూరులో 11 మంది, చిత్తూరులో 9 మంది, గుంటూరులో ఐదుగురు మరణించారు. గడిచిన 24 గంటల్లో 8,528 మంది కోవివ్ నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి వెళ్లారు.. ఇప్పటివరకూ రాష్ట్రంలో 34, 79,990 శాంపిల్స్ పరీక్షించారు.