Pawan Kalyan: బడి విద్యార్థుల సభలో ఇంగిత జ్ఞానం లేకుండా పవన్‌పై జగన్ ఇలా మాట్లాడతారా?: నాదెండ్ల మనోహర్

ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి పవన్ ను టార్గెట్ చేస్తున్నారని నాదెండ్ల అన్నారు.

Pawan Kalyan: బడి విద్యార్థుల సభలో ఇంగిత జ్ఞానం లేకుండా పవన్‌పై జగన్ ఇలా మాట్లాడతారా?: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar

Updated On : June 28, 2023 / 7:31 PM IST

Nadendla Manohar – Jagan: ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇంగిత జ్ఞానం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని జనసేన (JanaSena) నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) భీమవరంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కేవలం పవన్ ను విమర్శించడానికే రూ.6 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి సభ పెట్టారని అన్నారు.

” జగన్ రెడ్డికి సిగ్గుండాలి.. పాఠశాలల విద్యార్థుల సభలో ఇంగిత జ్ఞానం లేకుండా పవన్ పై జగన్ ఆరోపణలు చేశారు. పవన్ లారీ ఎక్కితే మీకేంటి? మీరు హెలికాప్టర్లో తిరుగుతున్నారు కదా? ఏదో ఒక రోజు మీరు లారీ, కార్లపై తిరగాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా పవన్ పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. 2024లో వైసీపీకి కాలం చెల్లుతుంది. ఏజెన్సీ నుంచి గంజాయి వస్తుంది. దానికోసం జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడరు? తాను ఓడిపోయినా సరే రాజకీయాల నుంచి దూరంగా వెళ్లనని పవన్ చాలాసార్లు చెప్పారు. గత ఎన్నికల ఫలితాల తరువాత నాతో అన్నారు. అది ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమ. ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. జగన్ లాంటి దుర్మార్గపు నాయకులను ఇంటికి పంపించాలి ”

Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు