Nara Lokesh: అందుకే చంద్రబాబును జైలులో పెట్టారు: నారా లోకేశ్

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్‌ను తాను కోరలేదని, చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని లోకేశ్ చెప్పారు.

Nara Lokesh: అందుకే చంద్రబాబును జైలులో పెట్టారు: నారా లోకేశ్

Nara Lokesh

Updated On : October 6, 2023 / 5:15 PM IST

Chandrababu Arrest: వైసీపీ తీరుపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి ములాఖత్ లో కలిశారు.

అనంతరం నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ… ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మొదట రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారని అన్నారు. దానిపై మాట మార్చుతూ ఇటీవల రూ.27 కోట్ల అవినీతి అన్నారని చెప్పారు. కక్ష సాధింపు కోసమే చంద్రబాబు నాయుడిని రిమాండుకు పంపారని తెలిపారు. న్యాయం తమవైపే ఉందని చెప్పారు.

పోరాటాన్ని ఆపవద్దని, శాంతియుతంగా దాన్ని కొనసాగించాలని చంద్రబాబు నాయుడు అన్నారని నారా లోకేశ్ చెప్పారు. ప్రజల కోసం పోరాడితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. పోలవరంపై మాట్లాడితే జైలుకు పంపారని తెలిపారు.

వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలు పంపారని నారా లోకేశ్ అన్నారు. న్యాయం జరగడంలో ఆలస్యం అయినా చివరకు జరిగి తీరుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఏనాడూ తప్పు చేయని వ్యక్తి అని చెప్పారు. చంద్రబాబు నాయుడిని ఇన్ని రోజుల పాటు రిమాండులో ఉంచినప్పటికీ ఆయన అధైర్య పడలేదని తెలిపారు.

Rekha Nayak: కంటతడి పెడుతూ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే రేఖా నాయక్.. ఎందుకంటే?