NIA Raids : తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

ఏపీ, తెలంగాణలోని విరసం, పౌర హక్కుల నేతల ఇళ్లలో NIA సోదాలు నిర్వహిస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని విరసం నేత వరలక్ష్మి ఇంట్లో NIA అధికారులు సోదాలు చేస్తున్నారు.

NIA Raids : తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

Nia Raids In Ap, Telangana

Updated On : March 31, 2021 / 8:43 PM IST

NIA Raids in AP, Telangana : ఏపీ, తెలంగాణలోని విరసం, పౌర హక్కుల నేతల ఇళ్లలో NIA సోదాలు నిర్వహిస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని విరసం నేత వరలక్ష్మి ఇంట్లో NIA అధికారులు సోదాలు చేస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లోని పౌర హక్కుల నేత, ప్రముఖ న్యాయవాది రఘునాథ్‌ ఇంట్లో, డప్పు రమేష్‌ ఇంట్లో కూడా ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేస్తున్నారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన చంద్రశేఖర్‌ నివాసంలో NIA సోదాలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా అరోరానగర్ లో విరసం నేత పినకాపాణి ఆఫీస్ లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయని ప్రొఫెసర్ కాశీం, నలమాస కృష్ణతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.