Mudunuri Prasada Raju : పవన్ కళ్యాణ్ సవాల్స్ స్వీకరించాల్సిన అవసరం లేదు : ముదునూరి ప్రసాద రాజు
గోదావరిపై వశిష్ట బ్రిడ్జి ఆలస్యం అవడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. అన్ని సమస్యలు అధిగమించి పనులు ప్రారంబించామని చెప్పారు.

Mudunuri Prasada Raju
Pawan Kalyan Challenges : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్స్ ను స్వీకరించాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 6వేల కిలోమీటర్ల రోడ్లు వేశారని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో 4సంవత్సరాల కాలంలోనే 7వేల కిలోమిటర్ల రోడ్లు వేశామని వెల్లడించారు.
ఈ మేరకు సోమవారం ముదునూరి ప్రసాద్ రాజు ఏలూరులో 10tvతో ప్రత్యేకంగా మాట్లాడారు. గోదావరిపై వశిష్ట బ్రిడ్జి ఆలస్యం అవడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. అన్ని సమస్యలు అధిగమించి పనులు ప్రారంబించామని చెప్పారు. గోదావరి జిల్లాలో రౌడీయిజం ఉంటే ప్రజలే వ్యతిరేకిస్తారని వెల్లడించారు.
Mallu Ravi : జేపీ నడ్డా ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు.. బండి సంజయ్ చేయబోమన్నారు : మల్లు రవి
ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధితో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా తమ ప్రభుత్వం ప్రజల అవసరాల మేరకు పనులు చేసుకుపోతుందన్నారు.