ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? లేదా? డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యల్లో అర్థమేంటి?
వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే విషయం కూటమి ప్రభుత్వ పెద్దలు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan
వైసీపీ హయాంలో వాలంటీర్లు చాలా కీలకంగా పనిచేశారు. పెన్షన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చేందుకు వారిధిగా వాడుకుంది వైసీపీ. ఈ వాలంటీర్ వ్యవస్థను వైసీపీ దుర్వినియోగం చేసిందన్నదానిపైనే ఏపీ ఎన్నికల వేళ పెద్దఎత్తున చర్చ జరిగింది. వాలంటీర్ల సెంట్రిక్‌గానే ఎలక్షన్ ప్రచారం హీటెక్కింది. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ఇప్పుడు వాలంటీర్లను కొనసాగిస్తుందా లేదా అన్నది అంతుచిక్కని అంశం అయిపోయింది. లేటెస్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్‌ల విజ్ఞప్తిపై స్పందించిన పవన్.. తమ ప్రభుత్వం వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ఉందని చెప్పారు. కానీ గత ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసిందని..వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చని..కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరంటూ చెప్పడం సంచలనంగా మారింది.
వైసీపీ ఏమంటోంది?
దీంతో కూటమి సర్కార్ వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడినట్లేనని విమర్శిస్తోంది అపోజిషన్ వైసీపీ. తాము లక్షల మంది వాలంటీర్లను పెట్టి ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేస్తే..కూటమి సర్కార్ ప్రజలను ఇబ్బంది పెడుతోందని మండిపడుతోంది. అంతేకాదు వాలంటీర్లకు 10వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు..అసలుకే ఎసరు పెట్టే కుట్రకు తెరలేపారని అంటున్నారు. వాలంటీర్లను కొనసాగించలేమని డైరెక్టుగా చెప్పుకుండా.. కుంటిసాకులు చెప్పి ఎస్కేప్ అయ్యే స్కెచ్ వేశారని అటాక్ చేస్తోంది వైసీపీ.
అయితే వాలంటీర్ వ్యవస్థతో వైసీపీ ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడిందని అప్పట్లో పవన్ చేసిన కామెంట్స్ పెద్ద వివాదం అయ్యాయి. సేమ్‌టైమ్ వాలంటీర్లలో ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారన్న ప్రచారం ఉంది. అందుకే ఎన్నికల ముందు కొంతమందితో రాజీనామా చేయించి..పార్టీకి పని చేయించుకున్నారని అంటోంది టీడీపీ.
దాంతో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే విషయం కూటమి ప్రభుత్వ పెద్దలు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని..సర్పంచ్‌లు, పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుండటంతో ఏ నిర్ణయానికి రాలేకపోతోంది ప్రభుత్వం. ఇదే సమయంలో వాలంటీర్లు అసలు వ్యవస్థలోనే లేరంటూ పవన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం చూస్తుంటే..కూటమి పెద్దలు వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరించే ఆలోచనలో లేరన్న టాక్ వినిపిస్తోంది.
ఎన్నికల సమయంలో వాలంటీర్ల ఇష్యూ వివాదం
వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను పెట్టి ..పెన్షన్ పంపిణీ, ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల ఇష్యూ వివాదం కావడంతో..పెద్ద సంఖ్యలో వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు.. కొంతమంది మూకుమ్మడిగా ఉద్యోగాల నుంచి తప్పుకున్నారు. వాలంటీర్‌లు కొనసాగుతున్నవారు తమను తిరిగి కొనసాగిస్తారని ఆశల్లో ఉన్నారు.
అయితే కూటమి సర్కార్‌లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. పలు సందర్భాల్లో చంద్రబాబు, మంత్రులు వాలంటీర్లను కొనసాగిస్తామని చెబుతున్నారు. కానీ వారికి సంబంధించి ఎలాంటి నిర్ణయం మాత్రం తీసుకోవడం లేదు. ఇప్పుడు పవన్ కామెంట్స్‌తో కొత్త చర్చ ప్రారంభమైంది. వాలంటీర్ వ్యవస్థకు తామే బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకుంటున్న వైసీపీకి షాక్ ఇచ్చేలా పవన్ కామెంట్స్ చేశారని అంటున్నారు. వారి సేవలను వాడుకుని వాలంటీర్లను వైసీపీ మోసం చేసిందని చెప్పడంతో..గత ప్రభుత్వ తప్పును ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం జరుగుతుందంటున్నారు.
కుప్పం, హిందూపురం మున్సిపాలిటీలపై టీడీపీ గురి.. చంద్రబాబు, బాలకృష్ణ మాస్టర్ ప్లాన్