మీరు ఊరూరా తిరిగి కుర్చీలు తెచ్చుకున్నంత మాత్రాన..: పేర్ని నాని

బందరే కాదు రాష్ట్రవ్యాప్తంగా వేలాది హామీలను ప్రజలకు ఇచ్చి.. ఆ హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని చెప్పారు.

మీరు ఊరూరా తిరిగి కుర్చీలు తెచ్చుకున్నంత మాత్రాన..: పేర్ని నాని

Perni Nani

Updated On : February 19, 2024 / 5:14 PM IST

Perni Nani: టీడీపీ నేత నారా లోకేశ్ బహిరంగ సభలో వేదికపై కుర్చీని మడతపెట్టడంపై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి విమర్శలు గుప్పించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఊరికి ఒకచోట షాపు నుంచి కుర్చీని అద్దెకు తెచ్చుకున్నారు. ఆ కుర్చీని వేదిక మీద మడత పెట్టారు.

చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ 2019లోనే ఆ కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. మీరు ఊరూరా తిరిగి కుర్చీలు తెచ్చుకున్నంత మాత్రాన పరిస్థితులు మారతాయా? ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం జగన్‌దే. టీడీపీ సభలు చూడండి, వైసీపీ సభలు చూడండి అని అన్నారు.

టీడీపీ సభల్లోని ఖాళీ కుర్చీలు మడత పెట్టి ఎక్కడ పెట్టుకోవాలో చూసుకోండని వ్యాఖ్యానించారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చారని అన్నారు. ఓట్లు అడుక్కోవడానికి బందరు వచ్చి ఓట్లు హామీలను ఇచ్చి ఒక్కటన్న అమలు చేయలేదని తెలిపారు.

బందరే కాదు రాష్ట్రవ్యాప్తంగా వేలాది హామీలను ప్రజలకు ఇచ్చి ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని చెప్పారు. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మ్యా నిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్ 99 శాతం అమలు చేశారని తెలిపారు.

Vasantha Vs Devineni: మైలవరంలో టీడీపీ టికెట్‌పై వసంత, దేవినేని మధ్య పోరు