Janasena : ఏపీలో ‘జగనన్న ఒళ్లు గుల్ల ఆస్పత్రి’..!

ఏపీలో సీఎం జగన్ పేరుతో ఎన్నో పథకాలున్నాయి. జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, ఇలా ఎన్నో పథకాలi జగనన్న పేరుతో ఉన్నాయి. అంతేకాకుండా కొత్త మరో పేరు కూడా ఉంది సీఎం జగన్ పేరుతో. అదేమంటే.. ‘జగనన్న’ ఒళ్లు గుల్ల ఆస్పత్రి‘.

Janasena : ఏపీలో ‘జగనన్న ఒళ్లు గుల్ల ఆస్పత్రి’..!

Jagananna Ollu Gulla Hospital' In Ap

Updated On : July 15, 2022 / 4:20 PM IST

‘Jagananna Ollu Gulla Hospital’ in AP : ఏపీలో వైపీసీ చీఫ్..సీఎం జగన్ పేరుతో ఎన్నో పథకాలున్నాయి. జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, ఇలా ఎన్నో పథకాలు జగనన్న పేరుతో ఉన్నాయి. అంతేకాకుండా కొత్త మరో పేరు కూడా ఉంది సీఎం జగన్ పేరుతో. అదేమంటే.. ‘జగనన్న’ ఒళ్లు గుల్ల ఆస్పత్రి‘. అదేంటీ ఇదెప్పుడు పెట్టారు. మాకు తెలియదే అని ఆశ్చర్యపోతున్నారా? ఇది వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆస్పత్రి కాదులెండి..మరి ఎవరంటే..పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆస్పత్రి. ఇంతకీ ఈ ఆస్పత్రి ఎందుకు ఏర్పాటు చేశారంటే..ఏపీలో రోడ్ల పరిస్థితి గురించి జనసేన చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఏపీలో రోడ్ల దుస్థితిని తెలియజేయటానికి జనసేన తిరుపతిలో ఇలా ‘జగనన్న’ ఒళ్లు గుల్ల ఆస్పత్రి’ని ఏర్పాటు చేసి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

అసలే ఏపిలో రోడ్లు అధ్వాన్నంగా ఉంటాయి. దీనికి తోడు ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలకు మరింత దెబ్బతిన్నాయి. ఏ రోడ్డు చూసిన గుంతలమయంగానే ఉంది.దీంతో ప్రజల పాట్లు ఎన్నని చెప్పాలి. బైక్ మీద వెళ్లినా..ఆటోమీద ప్రయాణించినా నడుములు విరిగిపోతున్నాయి. బైక్ లు పడిపోయి జనాలు గాయాలపాలు అవుతున్నారు. రోడ్లమీద ప్రయాణించాలంటేనే హడలిపోతున్న పరిస్థితి ఉంది. ఇదే అంశంపై జనసేన కార్యకర్తలు తిరుపతిలో నిరసనలు చేపట్టారు.రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై జనసేన డిజిటల్ యుద్ధం ప్రారంభించింది.

Also read : GoodMorningCMSir: సర్కస్ ఫీట్లు కాద్సార్..!! ఏపీలో రోడ్ల దుస్థితిపై పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు..

గుంతలమయంగా ఉన్న రోడ్ల దుస్థితిని తెలియజేయటానికి..నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్రలేపటానికి ‘గుమ్ మార్నింగ్ సీఎం’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. మూడేళ్ల వైసీపీ పాలనలో రోడ్ల దుస్థితిపై సెటైరిక్ కార్యక్రమాలు చేపట్టింది. రోడ్ల దుస్థితిపై ఫోటోలు, వీడియోలు తీసి ప్రభుత్వానికి పంపుతోంది. జులై 15కల్లా రోడ్లపై గుంతలను పూడ్చి మరమత్తులు చేపట్టాలని జగన్ ఆదేశాలను ప్రకటనల్లో కాదు అమలులో చేసి చూపించాలని జనసేన డిమాండ్ చేస్తోంది. దీంట్లో భాగంగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.

తిరుపతిలో జనసేన కార్యకర్తలు వినూత్నంగా నిరసనలు తెలిపారు.రోడ్లపై ప్రయాణిస్తే పరిస్థితి ఇలా ఉంటోందని అని తెలియజేయటానికి కాళ్లకు, చేతులకు కట్లు కట్టుకుని నిరసన తెలిపారు. రోడ్లపై గుంతలు ఉన్నాయా? లేదా గుంతల్లో రోడ్లు ఉన్నాయా? అన్నట్లుగా ఉంది పరిస్థితి అని తెలియజేస్తూ..ఇటువంటి పరిస్థితుల్లో జగనన్న ఒళ్లు గుల్ల ఆస్పత్రి అంటూ నిసనలు తెలిపారు జనసేన సైనికులు..