Ram Mohan Naidu: దీన్ని చూసి జగన్‌కు భయం పట్టుకుంది: ఎంపీ రామ్మోహన్ నాయుడు
జనసేనతో టీడీపీ ఎందుకు కలిసి పని చేస్తుందో కూడా చెప్పారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.

Ram Mohan Naidu
Chandrababu Arrest: ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న భయంతోనే తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రజలు చంద్రబాబు, లోకేశ్ కు బ్రహ్మరథం పడుతుండడంతో, దీన్ని చూసి సీఎం జగన్‌కు భయం పట్టుకుందని చెప్పారు.
చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోలేకపోతోన్న జగన్.. అక్రమ కేసులు పెడుతున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. చంద్రబాబుకు ప్రజలందరూ అండగా నిలబడుతున్నారని చెప్పారు. చంద్రబాబుని అరెస్టు చేసి ఇన్ని రోజులైనా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని అన్నారు.
చంద్రబాబుని అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతారని జగన్ అనుకున్నారని రామ్మోహన్ నాయుడు చెప్పారు. తాము కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు. అలాగే, ప్రజా క్షేత్రంలో వైసీపీ కుట్రలను తెలియజేస్తామని చెప్పారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించటానికి జనసేనతో కలిసి పని చేస్తామని తెలిపారు. వైసీపీకి సీఐడీ తొత్తుగా వ్యవహరిస్తోందని చెప్పారు. పరిధి దాటి సీఐడీ వ్యవహరిస్తోందని అన్నారు.
KA Paul : ఆ పార్టీల నుంచి నేతలు ప్రజాశాంతి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు : కేఏ పాల్