Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు ఏమన్నా విప్లవ వీరుడా, అవినీతి చేసి జైలుకెళ్ళిన వ్యక్తి : సజ్జల సెటైర్లు

చంద్రబాబు లాయర్లు నెల రోజుల నుండి క్వాష్ పిటిషన్ పైనే నడిపిస్తున్నారని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి, విచారణ నుండి తప్పించుకునే ప్రయత్నమే తప్ప.. తప్పు జరగలేదని చెప్పడం లేదన్నారు.

Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు ఏమన్నా విప్లవ వీరుడా, అవినీతి చేసి జైలుకెళ్ళిన వ్యక్తి : సజ్జల సెటైర్లు

Sajjala Ramakrishna Reddy

Updated On : October 11, 2023 / 4:28 PM IST

Sajjala Ramakrishna Reddy on Chandrababu arrest : చంద్రబాబు ఏమన్నా విప్లవ వీరుడా.. అవినీతి చేసి జైలుకి వెళ్లిన వ్యక్తి అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్టుకు కక్ష సాధింపు అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ మండిపడ్డారు. 2018 లోనే ఈ స్కాంను gst వాళ్లు బయటకి తెచ్చారని తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉండి రూ.300 కోట్లు దోచేశారని ఆరోపించారు. దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయని, అవి నిరూపణ అయ్యాకే అరెస్ట్ జరిగిందని అన్నారు. ఆధారాలు ఉన్నాయి కనుకే కోర్టు రిమాండ్ విధించిందన్నారు.

కోర్టుల్లో లాయర్లు ప్రోటోకాల్ పాటించలేదు అని మాత్రమే అంటున్నారు.. స్కాం గురించి మాట్లాడటం లేదని.. చంద్రబాబు లాయర్లు నెల రోజుల నుండి క్వాష్ పిటిషన్ పైనే నడిపిస్తున్నారని అన్నారు. విచారణ నుండి తప్పించుకునే ప్రయత్నమే తప్ప.. తప్పు జరగలేదని చెప్పడం లేదన్నారు. చంద్రబాబు అవినీతి, దోపిడీ ప్రజలు గమనించారని అన్నారు. అమరావతి పెద్ద కుట్ర.. వేల కోట్ల స్కాం కు ప్లాన్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు అండ్ కో అనుకున్నది జరిగి ఉంటే లక్షల కోట్లు స్కాం జరిగేదని అంటూ ఆరోపించారు సజ్జల.

Also Read : చంద్రబాబుకు దోమలు కుడితే జైల్లో అన్నిసేవలు ఉన్నాయి : మంత్రి గుడివాడ అమర్నాథ్

హెరిటేజ్ కంపెనీకి అక్కడ యెందుకు భూములు కొన్నారు..? తప్పు జరగకపోతే హెరిటేజ్ కి అక్కడ భూములు కొనకూడదు కదా అని అన్నారు. జైల్లో దోమలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని.. మావోయిస్టుల బెదిరింపులు ఉన్నాయని రోజుకో రకంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఇప్పుడు మళ్ళీ డీహైడ్రేషన్ తో బాధపడతున్నారని అంటున్నారు. కానీ ఇవన్నీ వాస్తవాలు కాదన్నారు. జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉంది. వయసు దృష్ట్యా బాగానే చూసుకుంటున్నారని.. టీడీపీ నేతలు రోజుకో స్టేట్మెంట్స్ ఇస్తూ లేకి తనంగా వ్యవహరిస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

Also Read: జగన్ హయాంలో హిందువులు బాధపడని రోజే లేదు : సాధినేని యామిని