Vontimitta : ఒంటిమిట్టలో ఇవాళ సీతారాముల కల్యాణం.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. భక్తులు ఇలా చేరుకోవచ్చు

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. కడప - తిరుపతి రహదారిపై ఒంటిమిట్ట ఉంది. కడప నుంచి 26 కిలో మీటర్లు దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.

Vontimitta : ఒంటిమిట్టలో ఇవాళ సీతారాముల కల్యాణం.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. భక్తులు ఇలా చేరుకోవచ్చు

Kodandarama Temple

Vontimitta Kalyanam : ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో ఇవాళ దివ్యస్వరూపుడు, సద్గుణ సంపన్నుడు శ్రీరాముడు, నారీ శిరోమణీ సీతాదేవిల కల్యాణం జరగనుంది. సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రారంభంకానున్న స్వామివారి కల్యాణంను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం, జిల్లా అధికారుల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించనున్నారు. వేసవికాలంను దృష్టిలో ఉంచుకొని గ్యాలరీలలో ఎయిర్ కూలర్లు, స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నిలక ప్రవర్తన నియమావళి అమలులో ఉండటంతో సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం జగన్ హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్ వలవన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Also Read : Rajamouli Dance : ఇటీవల భార్యతో రాజమౌళి డాన్స్.. ఎవరు నేర్పించారో తెలుసా? పవన్ కళ్యాణ్ పాటకు కూడా రాజమౌళి డాన్స్..

ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు కొనసాగుతుంది. భక్తులకు తలంబ్రాల ప్యాకెట్లు అందించేందుకు టీటీడీ అధికారులు సిద్ధం చేశారు. మరోవైపు సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 6గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించనున్నారు. కల్యాణ వేదిక సమీపం నుంచి కడప మార్గంలో 10 చోట్ల, సాలాబాద్ వద్ద అయిదు ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. కడప నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలు ఆలంఖాన్ పల్లె మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి నుంచి కడపకు వచ్చే వాహనాలు రేణిగుంట వద్ద దారి మళ్లించి వయా రాయచోటి మీదుగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. రాజంపేట నుంచి వెళ్లే వాహనాలు కూడా రాయచోటి మీదుగా మళ్లించడం జరిగిందని, రాజంపేట వైపు నుంచి ద్విచక్ర వాహనదారులు సాలాబాద్ నుంచి ఇబ్రహీంపేట, మాధవరం మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.

Also Read : Nallamilli Ramakrishna Reddy : అనపర్తిలో మారుతున్న రాజకీయ పరిణామాలు

ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు..
ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులు పలు మార్గాల్లో ఒంటిమిట్టకు చేరుకోవచ్చు. కడప – తిరుపతి రహదారిపై ఒంటిమిట్ట ఉంది. కడప నుంచి 26 కిలో మీటర్లు దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. అదేవిధంగా రైలులో వచ్చేభక్తులు రాజంపేట రైల్వేస్టేషన్ లో దిగి బస్సులో ఒంటిమిట్టకు చేరుకునే వీలుంటుంది. కడప రైల్వే స్టేషన్ లో కూడా రైలు దిగి బస్సు, ఇతర వాహనాల్లో ఒంటిమిట్టు చేరుకోవచ్చు. అదేవిధంగా తిరుపతి విమానాశ్రయం నుంచి ఒంటిమిట్ట సుమారు 100 కిలో మీటర్ల దూరం ఉంటుంది.