Somireddy Chandramohan Reddy: రాష్ట్ర ప్రజలను కాపాడమని కోరేందుకే ఢిల్లీకి -సోమిరెడ్డి
ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని, రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోయాయన్నారు.

Agriculture Officers Shocks Minister Somireddy Chandramohan Reddy
Somireddy Chandramohan Reddy: ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని, రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గాడి తప్పి, డ్రగ్స్‌కి నిలయంగా మారిపోయిందన్నారు. డ్రగ్స్‌పై మాట్లాడితే, పట్టపగలే దాడులు చేస్తున్నారని అన్నారు. ఏపీ నుంచే డ్రగ్స్ ఎగుమతి అయ్యే పరిస్థితి ఉందని, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని అన్నారు. మద్యంలో డ్రగ్స్ కలుపుతున్నారని, రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు.
మాదక ద్రవ్యాలు, కల్తీ మద్యం ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్ మాఫియాను నియంత్రించాల్సిన అవసరం ఉందని, న్యాయవ్యవస్థపైనా తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు. ఏపీలో సాధారణ పరిపాలన లేదని, ప్రతిపక్షాలు లేకుండా చేయలన్న ఆలోచన మాత్రమే ఉందని అన్నారు.
పట్టపగలే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు జరిగితే ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడాలని రాష్ట్రపతిని కోరేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రెండెళ్లుగా ప్రతిపక్షంగా చేయాల్సింది అంతా చేశామని, ప్రజలను కాపాడటానికి, అవినీతిని ఎదుర్కొనడానికి పోరాడుతూనే ఉంటామని అన్నారు సోమిరెడ్డి.
పరిస్థితి చేయిదాటి ఉంది కాబట్టే ఇప్పుడు ఢిల్లీ వచ్చామని, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అనేవారు. ఇప్పుడు అదే వల్లకాడుగా మారుతోంది అని అన్నారు. ఎన్డీయేలో ఉన్నామా? లేదా? అనేది అప్రస్తుతమని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
Read More:
ఇండియన్ రైల్వేస్‌లో రియల్ హీరోస్.. మూడేళ్లలో 120మందిని కాపాడారు
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. నాలుగు నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
ప్రముఖ తెలుగు నటుడు రాజబాబు కన్నుమూత
ఓడిపోయిన మ్యాచ్‌లో రికార్డు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా!