పేపర్ శిల్పి ఈ అమ్మాయి..వైట్ పేపర్ తో అందమైన బొమ్మలు తయారీ

  • Published By: nagamani ,Published On : October 15, 2020 / 03:11 PM IST
పేపర్ శిల్పి ఈ అమ్మాయి..వైట్ పేపర్ తో అందమైన బొమ్మలు తయారీ

Updated On : October 31, 2020 / 4:13 PM IST

srikakulam:శిల్పి అంటే శిలతో శిల్పాలు చెక్కినవారికే కాదు అద్భుతమైన బొమ్మల్ని తయారు చేసేవారిని కూడా శిల్పులే అంటారు. రాళ్లతో అందమైన బొమ్మల్ని చెక్కేవారు కొందరైతే..మట్టి ముద్దలతో చేసేవారు మరికొందరు. ఇంకొందరు మైనంతో చేస్తారు. కానీ శ్రీకాళం జిల్లాకు చెందిన సింగూరు హరిప్రియ అనే బీటెక్ విద్యార్థిని మాత్రం ‘‘తెల్లని కాగితాలతో’’ అద్భుతాలు సృష్టిస్తోంది.



అత్యంత సునాయాసంగా తెల్ల కాగితాలతో కళాకండాలుగా రూపొందిస్తోంది. అవి కాగితం మొమ్మలని చెబితేనే గానీ తెలియవు..ఇవేంటబ్బా ఇంత అందంగా ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారు ఆ బొమ్మలు చూసినవారంతా. దేంతో చేశారు? తేలిగ్గా…అందంగా చూస్తే కళ్లు తిప్పుకోలేకపోతున్నాం అంటున్నారు హరిప్రియ బొమ్మలు చూసినవారంతా..


ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన బీటెక్ చదివే సింగూరు హరిప్రియకు చిన్న తనం నుంచి ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అనుకునేది. అలా తెల్లని కాగితాలతో కళాకండాలను సృష్టించటం ప్రారంభించింది. తన అద్భుతమైన కళతో అందరి మనసులు దోచుకుంటోంది.


హరిప్రియ తయారు చేసిన బొమ్మల్లో సిగ్గునొలకబోస్తూ..సిగ్గుపటే అమ్మాయి..నెమలి పించం భంగీమతో అందమైన అతివ..సిగ్గులొలకబోసే నవ వధువు లాంటి చిత్రాలు.. ఔరా అపిస్తున్నాయి.


ఇంకా పక్షి బొమ్మలతో పాటు మరెన్నో బొమ్మలు కాగితంపైనే తయారుచేసి అందర్నీ అబ్బురపరుస్తోంది హరిప్రియ. ఆమె తయారు చేసే బొమ్మలు సోషల్ మీడియాలో పాటు పలు వెబ్‌సైట్లలో హరిప్రియ చిత్రాలు వైరల్ అవుతున్నాయి.