మూడు రాజధానులు వ్యతిరేకించే వారే తుగ్లక్‌లు – తమ్మినేని సీతారాం

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు తుగ్లక్‌లు అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మూడు రాజధానులని ప్రకటించి..ప్రాంతీయ అసమానతలను తొలగించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న వారు తుగ్లక్‌లా ప్రజలు చెబుతారన్నారు. ఎందుకంత ఆతృతం అంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఉద్దేశించి కామెంట్ చేశారు.
దోపిడికి పాల్పడి..భూములను కొల్లగొట్టిన వారు..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాజధానుల అంశమే రెఫరెండం కాబోతోందని ప్రకటించారు. 23 మంది ఎమ్మెల్యేలను దక్కించుకోవాలని లేదా అంటూ టీడీపీని ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు. ఒక రాజకీయ పార్టీకి స్పష్టమైన క్లారిటీ ఉండాలని, ఎవరెవరి భూములున్నాయో అందరికీ తెలిసిందేనన్నారు. దోపిడి సాధ్యపడలేదు కాబట్టే..ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేదా చెప్పాలని సవాల్ విసిరారు.
మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రకటన, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికతో అమరావతిలో పరిస్థితులు మారిపోయాయి. రాజధాని రైతులు ఆందోళన బాట పట్టారు. దీనిపై ఇటీవలే స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి రాజధానికి వెళుతున్న సమయంలో రాజస్థాన్ ఎడారిలో పోతున్న ఫీలింగ్ వచ్చిందని కామెంట్స్ చేశారు. దీనిపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ పండిన పంటలు కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More : ఏపీ కేబినెట్ నిర్ణయాలు..ఇవే..