పోటాపోటీ : బాబు కనిపించడం లేదు..పీఎస్‌లో కంప్లయింట్

  • Published By: madhu ,Published On : December 24, 2019 / 07:39 AM IST
పోటాపోటీ : బాబు కనిపించడం లేదు..పీఎస్‌లో కంప్లయింట్

Updated On : December 24, 2019 / 7:39 AM IST

ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదనే కంప్లయింట్స్ అధికమౌతున్నాయి. పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయ్యారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే…వైసీపీ నేతలు కూడా కంప్లయింట్స్ చేయడం ప్రారంభించారు.

తాజాగా మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కనిపించడం లేదంటూ…కుప్పం పీఎస్‌లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం రాజకీయంగా హీట్ పెంచింది. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం కుప్పం చెరువు కట్ట నుంచి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించాయి వైసీపీ శ్రేణులు. బాబును వెతికి పెట్టాలంటూ కుప్పం రూరల్ సీఐ కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. కుప్పం నుంచి ఏడుసార్లు గెలిచినా..ప్రజల గురించి పట్టించుకోలేదని వారు ఆరోపించారు. 

* కుప్పంలో ఎమ్మెల్యే కార్యాలయంగానీ, చంద్రబాబు నివాసంగానీ లేవని వైసీపీ శ్రేణులు అన్నాయి. కుప్పంలో చంద్రబాబుకు ఓటు హక్కు లేదని విమర్శించారు. 
* టీడీపీ నేతలు వైసీపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 
* వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కూడా కనిపించడం లేదని రాజధాని ప్రాంత వాసులు కంప్లయింట్ చేశారు. దీంతో వైసీపీ నేతలు * కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు. గెలిచిన తర్వాత..కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చారని, తమ ఎమ్మెల్యే వెతికి పెట్టాలని వారు కోరారు. 
 

Read More : శ్రీదేవిని వెతికిపెట్టండి.. మిస్సింగ్ కేసు పెట్టిన రాజధాని మహిళలు